MISSION | మిషన్ భగీరథ మ్యాన్ హోల్

MISSION | మిషన్ భగీరథ మ్యాన్ హోల్

నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

MISSION | హసన్ పర్తి, ఆంధ్రప్రభ :  హన్మకొండ కరీంనగర్ ప్రదాన రహదారిని ఆనుకొని ఉన్న మ్యాన్ హోల్ ను పట్టించుకోక పోవడంతో ప్రజలు భయాంధోళనకు గురవుతున్నారు. ప్రదాన రహదారిలో పెద్ద చెర్వు కట్ట సమీపాన ఎల్లమ్మ గుడికి ఎదురుగా యాదవనగర్,వెంకటేశ్వర స్వామి కి వెళ్ళే దారిలో ఎడమ వైపున తారు రోడ్ కు ఆనుకొని వున్న మిషన్ భగీరథ పైపు లైన్ పై కప్పు పగిలిపోవడం మూలంగా ఏర్పడిన మ్యాన్ హోల్ (Man Hole) భయంకరంగా మారింది. రద్దీ ఉన్న సమయంలో లారీ పైపు లైన్ పై వెళ్ళడం మూలంగా ఈ పరిస్థితి నెలకొంది. పైపు లైన్ పై మూత పగిలి పోయి ఎర్పడిన, మ్యాన్ హోల్ ను నెలలు గడుస్తున్నా అధికారులు,ప్రజాప్రతినిధులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈమ్యాన్ హోల్ ప్రదాన రహదారికి ఆనుకొని ఉండడంతో ఏక్షణాన ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఒక వైపు ప్రదాన రహదారిని విస్తరించక పోవడం, మరోవైపు సెంట్రల్ లైటింగ్  సిస్టం (Central Lighting System) లేకపోవడంతో, ప్రమాదాలకు నిలయంగా, ఆగమ్యగోచరంగా మారింది.ప్రదాన రహదారలో రాత్రి వేళలో ఎక్కడ ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని, భయానక వాతవణం ఆవరించింది.హసన్ పర్తి ఎర్రగట్టు జంక్షన్ నుండి ఎల్లాపూర్ వరకు మూల మలుపులతో చీకటి మయంగా ఉండడంతో వాహనదారులు ప్రయాణించాలంటే జంకుతున్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు మాత్రమే ప్రజాప్రతినిధులు అధికారులు సందర్శించి, తూ తూ మంత్రంగా సలహలు ఇచ్చి వెళ్ళి పోతున్నారు. రహదారిని పోర్ లైన్ల రహదారి గా మార్చడాన్ని, కొందరు పనిగట్టుకొని వ్యతిరేకించడం మూలంగా ఈ పరిస్థితి నెలకొంది.

పోర్ లైన్ల రహదారి పనులను హసన్ పర్తి పై నుండి చేపట్టడంతో, ప్రదాన రహదారిని పట్టించుకునే నాదుడే కరవయ్యారు. గత కొన్ని నెలల క్రితం పెద్ద చెర్వు మూలమలుపు వద్ద ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈసంఘటనతో వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు (MLA KR Nagaraju) హుటా హుటీన ప్రదాన రహదారిని సందర్శించి, పరిశీలించారు. రోడ్ విస్తరణల పనులకు, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు చేపట్టుతారని హమీ ఇచ్చారు. నెలలు గడుస్తున్నా పనులు ఆచరణలోకి రాకపోవడంతో ప్రదాన రహదారిలో క్షణమొక యుగంగా వెళ్ళాల్సి వస్తుందని ప్రయాణీకులు వాపోతున్నారు.ఇప్పటికైనా తక్షణమే ప్రదాన రహదారికి ఆనుకొని మ్యాన్ హోల్ ను మూసివేయాలని, రోడ్ విస్తరణ పనులు, సెంట్రల్ సిస్టం ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టి, ప్రమాదాల నుండి ప్రయాణీకులను కాపాడాలని కోరుతున్నారు.

Leave a Reply