CM Revanth | వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలి…

CM Revanth | ఉదండాపూర్, ఆంధ్ర‌ప్ర‌భ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి(MLA Janampally Anirudh Reddy) ఈ రోజు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఉదండాపూర్ నిర్వాసితులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ(R&R package) ఫైలును రాబోయే కేబినెట్ మీటింగ్‌లో పెట్టి ఆమోదించాలని అనిరుధ్‌ సీఎంను కోరారు.

ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కొంత మంది ఇంటి నిర్మాణానికి పునాదులు వేసుకోగా అవి ఇందిరమ్మ యాప్‌(Indiramma App)లో అప్ లోడ్ కాకపోవడం వల్ల వారికి బిల్లులు ఆగిపోయాయని, ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారి వివరాలను జిల్లా కలెక్టర్(District Collector) ద్వారా ప్రభుత్వానికి పంపడం జరిగింద‌న్నారు. ఇందిరమ్మ యాప్‌లో ఉన్న సాంకేతిక సమస్యలు తొలగించి ఆ బిల్లులను సత్వరమే క్లియర్ చేయాలని అన్నారు.

రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో తన తాత దేశ్ ముఖ్ పేరిట ఉన్న భూమిని రైతుల పేరిట మార్చడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపాన‌ని, వాటిపై వెంటనే చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని, అక్కడే ఉన్న రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటిని(Minister Ponguletini) ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కోరారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

Leave a Reply