MLA | చిత్రపటానికి పూలమాలలు..

MLA | చిత్రపటానికి పూలమాలలు..
MLA | ఉట్నూర్, ఆంధ్రప్రభ : భారతదేశ తొలి ఉక్కు మహిళ ప్రధాని ఇందిరా గాంధీ చేసిన సేవలు ప్రశంసనీయమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అన్నారు. అదిలాబాద్ జిల్లా ఉట్కూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఇందిరా గాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే బొజ్జు పటేల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆశయ సాధనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఎంతో కృషి చేస్తున్నారని, సంక్షేమ పథకాలకు ఇందిరాగాంధీ(Indira Gandhi) పేరు పెట్టి ఆమె ఆశయ సాధనకు కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జైనుర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాత్ రావు, అదిలాబాద్ ఆర్టిఏ మెంబర్ దూట రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి చంద్రయ్య(Lingampally Chandraiah), బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బిరుదుల లాజర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసండ్ల ప్రభాకర్, కొత్తపెళ్లి మహేందర్, ప్రభాకర్ రెడ్డి, గొల్లపల్లి నరసయ్య, భాగ్యలక్ష్మి, మాజీ సర్పంచ్ జగదీష్ జాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
