CM Revanth | ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం
- భారత దేశ రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీ
CM Revanth | అచ్చంపేట, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, ప్రపంచ పటంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సాహసోపేత నిర్ణయాలు తీసుకొని ఉక్కు మహిళా నేతగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ(Indira Gandhi) సేవలు చిరస్మరణీయమని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్(TPCC Chief Mahesh Goud) అన్నారు.
ఈ రోజు అచ్చంపేట పట్టణంలో ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ(Dr. Sigudu Vamsikrishna)తో కలిసి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గరీబీ హటావో నినాదంతో భారతదేశంలో గుడిసెలు లేని గ్రామాలను చూడాలని, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సామ్రాజ్యాల్ని ప్రభుత్వంలో విలీనం చేసి బానిస విముక్తిని కలిగించడం, ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేయడం, ఇస్రోని స్(IsroniS) సృష్టించి గుండుసూది నుంచి రాకెట్ వరకు సొంతంగా భారతదేశమే సృష్టించే విధంగా అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకొని ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళా నేతగా ఇందిరాగాంధీ గుర్తింపు పొందారన్నారు. ఆమె చేసిన త్యాగాలు ఇప్పటికీ చిరస్మరణీయమని అన్నారు.
అమిత్ షా, మోడీ(Amit Shah, Modi)లు అధికారమే పరమావడిగా కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజ్యాంగ సహనానికి పూనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్తో యుద్ధం(War with Pakistan గెలిచిన తర్వాత బంగ్లాదేశ్ ను స్వతంత్ర దేశంగా ఆవిష్కరింపజేసిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు.

ఆస్తులు, ప్రాణ, పదవీ త్యాగాలు చేసిన కుటుంబం ఏదైనా ఉంది అంటే అది ఒక్క నెహ్రూ కుటుంబమేనని ఆ కుటుంబ వారసురాలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నేతృత్వంలో పనిచేస్తున్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వంగా ఫీల్ అవ్వాలని, 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో చేయలేని అభివృద్ధి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) 15 నెలలలోనే చేసి చూపించారని, వీటన్నిటిని ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, ఉమామహేశ్వర చైర్మన్ బీరం మాధవరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, జిల్లా గ్రంథాలయాల చైర్మన్ జి. రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

