20 crore | వైభవంగా….
- 108 అడుగుల పంచముఖ ఆంజనేయ విగ్ర ప్రతిష్టాపనకు సత్యనారాయణ వ్రతం
- రామగుండం ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు
- వందలాదిమంది దంపతులచే వ్రత మహోత్సవం
20 crore | గోదావరిఖని, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా రామగుండంలో శ్రీరామచంద్ర ప్రభు నదియాడిన అంజనాద్రి గుట్ట(Anjanadri Gutta)పై 108 అడుగుల పంచముఖ ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపనా ఏర్పాటు కోసం కార్తిక మాసం ముగింపు కావడంతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్(MLA Raj Thakur McConsingh), మనాలి ఠాకూర్ దంపతుల ఆధ్వర్యంలో సత్యనారాయణ వ్రత మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సుమారుగా 20 కోట్ల రూపాయల(20 crore rupees) వ్యయంతో భారత దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎత్తైన ఆంజనేయ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు, పనులు వేగంగా చేపడుతున్నారు.
విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాట్లకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా లోక శాంతి కోసం పదుల సంఖ్యలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సత్యనారాయణ వ్రత(Satyanarayana Vrata) మహోత్సవం కనుల పండుగగా చేపట్టారు. సత్యనారాయణ వ్రత మహోత్సవంలో పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వందలాది మంది దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు.

108 అడుగుల పంచముఖ ఆంజనేయస్వామి(108 feet Panchamukha Anjaneyaswami) విగ్రహ ప్రతిష్టాపనకు ముందు చేపట్టిన సత్యనారాయణ వ్రత మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశిష్టత కలిగిన గుట్టపై చేపడుతున్న మహత్తరమైన సంకల్పంతో చేపడుతున్న భక్తిశ్రద్ధలతో చేపడుతున్న వ్రత మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు ప్రతినిధులు పరిశ్రమల అధికారులు పాల్గొన్నారు.


