10 lakhs | టెస్టుల పేరుతో 500 కోట్లు దుబారా…

10 lakhs | టెస్టుల పేరుతో 500 కోట్లు దుబారా…

10 lakhs | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన ఇన్సూరెన్స్ లో అనుమతులను వెంటనే రద్దు చేయాలని టీయుసీఐ(TUCI) నారాయణపేట జిల్లా అధ్యక్షుడు కిరణ్, టీపీబీ ఓసీ జిల్లా అధ్యక్షుడు బీ. నరసింహ(B. Narasimha) డిమాండ్ చేశారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని టీయుసీఐ మండల సమావేశం చెన్నప్ప అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబరు కోడ్స్ వల్ల భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద మరణాలకు రూ.10 లక్షలు(Rs.10 lakhs), సహజ మరణాలకు రూ.2 లక్షలకు పెంచి, శాశ్వత, పాక్షిక అంగవైకల్యం ఈ నాలుగు సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్యూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిఓ నెం.12 ను 2025 జులై 22న విడుదల చేసిందన్నారు.

జీఓ విడుదల చేసిన 2 రోజులకే (ప్రైవేట్ బీమా కంపెనీలైన క్రెడిట్ యాక్సిస్ లైఫ్ ఇన్యూరెన్స్ కంపెనీకి రూ.250 కోట్లు, ఎర్గో జనరల్ ఇన్యూరెన్స్ కంపెనీకి రూ.95 కోట్లు, ట్రెయిల్ బ్లెజర్(Rs.95 crores, Trail Blazer) అనే బ్రోకర్ సంస్థ ద్వారా మొత్తం రూ. 340 కోట్లు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వ అధికారులు అక్రమంగా బదిలీ చేశారని ఆరోపించారు. కేంద్ర చట్టం, రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు(State Welfare Board) నిబంధనలకు విరుద్ధంగా నిధులు దారి మళ్ళించడాన్ని భవన నిర్మాణ కార్మిక  సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

సిఎస్సి హెల్త్ టెస్టుల పేరుతో ప్రభుత్వం సుమారు రూ.500 కోట్లు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కార్మికులకు అవసరం లేకున్నా హెల్త్ టెస్ట్లు చేయించుకోకపోతే లేబర్ కార్డులు తొలగిస్తామని కార్మికులను బెదిరిస్తూ, టెస్టులు చేస్తు 33 జిల్లాల్లో 17, కేంద్రాలను ఎంపిక చేసుకొని 7 మంది ల్యాబ్ మేనేజర్లను పెట్టి ఈ టెస్ట్లు చేస్తున్నారని అన్నారు. టెస్ట్లు ఒక్కో కేంద్రంలో రోజుకు 100 నుండి 150 వరకు టెస్ట్లు చేస్తు ఒక కార్మికునికి టెస్ట్ చేస్తే రూ. 3,250లు సిఎస్సి సంస్థకు బోర్డు నుండి చెల్లిస్తున్నారు.

రోజువారీగా 7 సెంటర్లలో సుమారు 1,000 మందికి టెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కరోజు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,000 మంది కార్మికులకు టెస్ట్ చేస్తూ టెస్ట్ చేసిన ఎంప్లాయికి సిఎస్సి సంస్థ వారు రూ.90ల చొప్పున చెల్లిస్తూ ఒక నెలకు 30,000 మందికి, సంవత్సరానికి 3,60,000 మందికి(3,60,000 people) టెస్ట్లు చేస్తున్నారని అన్నారు. వెల్ఫేర్ బోర్డు నుండి సుమారు రూ.500 కోట్లు టెస్ట్ల పేరుతో దుబారా ఖర్చు చేశారన్నారు. ఈనెల 25 న చేపట్టే చలో కలెక్టరేట్ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాపీ మేస్త్రి సంఘం నాయకుడు ఊట్కూర్ గ్రామ అధ్యక్షుడు నాగేష్, కనకరాయుడు, నరసింహ, హన్మంతు, వెంకటేష్, అశోక్, కోళ్ల కృష్ణయ్య, చిన్న బాలు, జనార్ధన్, కిష్టప్ప, శివప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply