Collector | రైతులకు అవగాహన అవసరం..

Collector | రైతులకు అవగాహన అవసరం..

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

Collector | కర్నూలు, ఆంధ్రప్రభ : మిరప పంటకు కాయ కుళ్లు, కాయ మచ్చ వంటి వ్యాధులు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ (Collector ) డా.ఏ.సిరి (Dr. A.Siri) రైతులకు సూచించారు. ఆదోని మండలం మదిరె గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మిరప పంట సాగును, ఎన్డిబిఎల్ జిన్నింగ్, ప్రెస్సింగ్, దాదా పీర్ మిల్ యూనిట్ లలో పత్తి కొనుగోలు ప్రక్రియను, అన్న క్యాంటీన్ లను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు..

తొలుత మిరప పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడి, వారి సమస్యలు, పంట పరిస్థితులు గురించి అడిగి తెలుసుకున్నారు..మిరప పంట సాగుకు ఎకరాకు ఎంత పెట్టుబడి వస్తుంది? విత్తనాలు ఎక్కడ నుండి కొనుగోలు చేస్తున్నారు? అనే విషయాలను కలెక్టర్ రైతులను అడిగి తెలుసుకున్నారు..

60శాతంకు పైగా మిరప పంటకు కాయ కుళ్ళు, కాయ మచ్చ వచ్చిందని రైతులు కలెక్టర్ కి చూపించారు. మిరప పంట (Chilli crop) కు కాయ కుళ్లు, కాయ మచ్చ వంటి వ్యాధులు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు… వ్యవసాయ అధికారులు రైతు సోదరులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, సమయానుకూలమైన సూచనలు, సాంకేతిక మార్గదర్శకాలు అందించాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు..

పత్తి రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.. పత్తికి మంచి ధర వచ్చేందుకు వీలుగా రైతులు పత్తిని బాగా ఆరబెట్టుకొని తేమ శాతం లేకుండా తీసుకొని వచ్చే విధంగా చూసుకోవాలని కలెక్టర్ (Collector) రైతులకు సూచించారు.. తేమ శాతం 14 ఉన్నా కూడా రైతుల నుండి పత్తిని కొనుగోలు చేసే విధంగా చూడాలని కలెక్టర్ సిసిఐ అధికారులకు సూచించారు.. తేమ శాతం కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ రైతులను వెనక్కు పంపకుండా, రైతులు నష్టపోకుండా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కలెక్టర్ సిసిఐ అధికారులను కోరారు..

పంట ఎక్కువగా ఉందని, మిల్లులు కొన్ని మాత్రమే ఓపెన్ అయ్యాయని, మిగిలిన మిల్లులను కూడా త్వరగా ఓపెన్ చేయించాలని, యాప్ లో స్లాట్ లు వెంటనే క్లోజ్ అవుతున్నాయని, సర్వర్ సమస్యలు ఉన్నట్లు సచివాలయం సిబ్బంది చెప్తున్నారని, పత్తి రైతులు వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు..

అన్న క్యాంటీన్ (Anna Canteen) ద్వారా రుచి, శుచితో ఉన్న భోజనాన్ని ప్రజలకు అందించాలని కలెక్టర్ అన్న క్యాంటీన్ సిబ్బందిని ఆదేశించారు… అక్కడే భోజనం చేస్తున్న యువకులు, మహిళలతో మాట్లాడుతూ భోజనం రుచిగా ఉందా? సరిపోయేంత పెడుతున్నారా? ప్రతి రోజు ఇక్కడే భోజనం చేస్తారా? భోజన పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అన్న క్యాంటీన్ లోపల శుభ్రంగా ఉంచుతున్నారా? అని కలెక్టర్ ఆరా తీశారు? భోజనం రుచిగా పెడుతున్నారని, సరిపోయినంత పెడుతున్నారని, క్యాంటీన్ శుభ్రంగా ఉంచుతున్నారని, ప్రతిరోజు ఇక్కడే భోజనం చేస్తామని, భోజనం చాలా బాగుంటుందని వారి కలెక్టర్ కు తెలిపారు..

అనంతరం కలెక్టర్ నేరుగా భోజనం వండిస్తున్న ప్రదేశం వద్దకి వెళ్ళి అన్నం, సాంబార్ లను పరిశీలిస్తూ అక్కడే ఉన్న అన్న క్యాంటీన్ సిబ్బందితో మాట్లాడుతూ వచ్చిన ప్రజలకు సరిపోయేంత భోజనం పెడుతున్నారా? మధ్యాహ్నం భోజనం ఏ సమయానికి ఇక్కడికి వస్తుంది? ప్రతి రోజు ఎంతమంది భోజనం చేస్తున్నారు? సమస్యలు ఏమైనా ఉన్నాయా, అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు… అనంతరం అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తున్న ప్రజలకు కలెక్టర్ స్వయంగా వండించారు..కార్యక్రమంలో ఆదోని ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, మార్కెటింగ్ ఏడి నారాయణ మూర్తి, ఆదోని తహసీల్దార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply