HIDMA ENCOUNTER : హిడ్మా అంతం
- మారేడుమిల్లిలో భారీ ఎన్ కౌంటర్
- భార్య రాజే సహా నలుగురు మృతి
- విజయవాడలో గెరిల్లా ఆర్మీ గుట్టురట్టు
- 21 మంది మహిళలు.. ఏడుగురు పురుషులు
- ఆక్టోపస్ ఆపరేషన్ సక్పెస్
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి )
ఆయుధాలు వీడి జన స్రవంతిలోకి వచ్చిన ఇద్దరు మావోయిస్టు అగ్రనేతల హెచ్చరికలు నిజమని తేలింది. లొంగిపో.. లేదో చచ్చిపోతావు.. అనే నినాదం వాస్తవరూపం దాల్చింది. దండకారణ్యంలో.. భద్రతదళాలకు నిద్ర కరవు చేసిన మాడ్వి హిడ్మా ( Most wanted maoist leader Story End) కథ ఎన్ కౌంటర్ తో ముగిసింది. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ మూలం కుప్పకూలింది. ఇక్కడ ? అక్కడ? ఎక్కడ? హిడ్మా అని వెయ్యి కళ్లతో నిఘా వర్గాలు వెతుకుతుంటే.. మరి కొన్ని రోజుల్లో హిడ్మా పోలీసులకు లొంగిపోతున్నాడని మీడియా ప్రకటించింది. ఇదిగో హిడ్మా.. అడుగో హిడ్మా అంటూ కథనాలు వినిపించాయి.
కానీ నిఘా వర్గాలకు పక్కా సమాచారం లభించింది. ఇటీవల లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాలరావు ( Ex Maoist Leader Mallojula) ఇచ్చారా? ఆశన్న తెలిపారా? ఇటీవల లొంగిపోయిన సునీత పూర్తి సమాచారం ఇచ్చిందా? హిడ్మా మాత్రం . దేశాలు వీడిపోలేదు. అడవిలోనే మాటు వేశాడనే సమాచారంతో.. మంగళవారం ఉదయం ఆపరేషన్ ఆక్టోపస్ లో.. హిడ్మా చరిత్రను తిరగరాశారు. ఇక మావోయిస్టు నేతల్లో.. మిగిలిన అగ్రనేతల్నీ త్వరలోనే అంత మొందిస్తారనే ప్రచారం తెరమీదకు వచ్చింది.
HIDMA ENCOUNTER హిడ్మా చరిత్ర అంతం

అల్లూరి సీతారామ రాజు (ASR District) జిల్లా మారేడుమిల్లి (Maredunilli Forest) అడవుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో.. మోస్టు వాంటెడ్ మావోయిస్టు సార్టీ అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మృతిచెందారు. ఈ ఘటనలో మారేడుమిల్లి లోతట్టు అటవీ ప్రాంతం మారేడుమిల్లి మండలం గోండువాడ (Gonduwada) గ్రామ సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు పక్కా సమాచారంతో భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా రంగంలోకి దిగాయి. గ్రేహౌండ్స్, (Grey Hounds) ప్రత్యేక పోలీసు బలగాలు (Special Forse)

అడవిని జల్లెడ పడుతుండగా (Cubing), మావోయిస్టులు తారసపడడం తో కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు (Encounter) జరిపారు. రెండు వర్గాల మధ్య భీకర పోరు సాగినట్లు ( పోలీసులు తెలిపారు. రంపచోడవరం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో, ఇంటిలిజెన్స్ ఏ డీజీ (Intelligence ADG) మహేష్ చంద్ర లడ్డ (Mahesh Chandra Ldda) మాట్లాడుతూ మంగళవారం ఉదయం 6:30 నుండి 7:10 గంటల మధ్య వ్యవధిలో మారేడుమిల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో గొందువాడ గ్రామ సమీపంలో ఎన్ కౌంటర్ జరిగిందని ఆయన తెలిపారు.
HIDMA ENCOUNTERహిడ్మా దంపతులు హతం

ఈ ఎన్ కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా (Maoist Party CCM Hidma) ఆయన భార్య రాజేతో (Wife Raje) పాటు గన్ మెన్ (GunMan Chaitu) చైతు, కమలేష్, దేవే, మల్లా మృతి చెందినట్లుగా తెలిపారు. మడివి హిడ్మా అలియాస్ హిడ్మన్న అలియాస్ సంతోష్ కేంద్ర కమిటీ సభ్యులు, సౌత్ బస్తర్ బెటాలియన్ ఛీఫ్ గా (South Bastar Batalian CheaF) వ్యవహరిస్తున్నారు. మడకం రాజే అలియాస్ రాజక్క రాష్ట్ర జోన్ కమిటీ సభ్యునాలు (South Zone Secreatary) , దేవే, లక్మల్ అలియాస్ చైతు, మల్ల అలియాస్ మల్లలు, కమ్లు అలియాస్ కమలేష్ మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మావోయిస్టుల మృతదేహాలను శవ పంచనామా నిమిత్తం రంపచోడవరం (Rampachodavaram) ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.
HIDMA ENCOUNTER ఎవరీ హిడ్మా ?

ఛత్తీస్ గడ్, దక్షిణ సుక్మా (Sukma District) జిల్లాలోని పూవర్తి (Puvarti village) గ్రామంలో 1981లో మాడ్వి హిడ్మా (Madvi Hidma) జన్మించాడు. 10వ తరగతి వరకు చదివాడు. 16 ఏళ్ల ప్రాయంలోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. అంచలంచెలుగా ఎదిగిన హిడ్మా మావోయిస్టు పార్టీలో కీలకనేతగా ( Key Role) ఎదిగాడు. ఆ తర్వాత మావోయిస్టుల్లో గెరిల్లా (Garilla Arrmy) యుద్ధరీతులను ప్రవేశపెట్టి అనేక దాడులకు కారణమయ్యాడు.
మావోయిస్టు అగ్రనేతలు హిడ్మాను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA)కి ఇన్చార్జిగా నియమించారు. 2016లో మరికొందరు మావోయిస్టులతో కలిసి హిడ్మా అరెస్టు అయ్యాడు. పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. విడుదలైన హిడ్మా దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటికి కమాండర్ గా (DSZC Camonder) అపాయింట్ అయ్యాడు. సుక్మా, దంతెవాడ, బస్తర్ అటవీప్రాంతాలు కేంద్రంగా హిడ్మా నిర్వహించిన అనేక దాడుల్లో కీలక పాత్ర పోషించాడు.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటికి సభ్యుడిగా ప్రమోషన్ అందుకున్నాడు. చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్రకమిటిలో సభ్యుడు (CCM) హిడ్మా అందరి దృష్టిని ఆకర్షించాడు. కొన్ని వందలమంది యువకులను దళంలోకి ఆకర్షించటమే కాకుండా మావోయిస్టులతో ప్రత్యేకంగా గెరిల్లా దళాన్ని తయారుచేయటంలో హిడ్మా కీలక పాత్ర పోషించాడు.
HIDMA ENCOUNTER హిడ్మా దాడుల్లో 100 మంది పైగా ఖతం
దంతెవాడ లో 2010, సుక్మా జిల్లాలో 2017లో పోలీసులపైన దాడులు చేయటంలో హిడ్మా వ్యూహాలే కీలకం. ఇప్పటి వరకు హిడ్మా ఆధ్వర్యంలో మావోయిస్టులు 27 గెరిల్లా (27 Attacks) తరహ దాడులకు పాల్పడి సుమారు వందమందికి ( Above 100) పైగా పోలీసుల మరణానికి (Police assassinated) కారణమయ్యాడు పోలీసుల కన్నుగప్పి హిడ్మా తప్పించుకుంటున్నా, ఒక విధంగా ఆయనకు పోలీసులకు మధ్య దూరం తగ్గిపోవడం 2024లోనే మొదలయింది.
HIDMA ENCOUNTER హిడ్మా సొంతూరుపై సర్కారు ఫోకస్
అది హిడ్మా సొంతవూరు (Birth Village) పూవర్తి లో మొదలయింది. ఇది సుక్మా జిల్లాలో ఉంటుంది. 2024లో ఫిబ్రవరిలో ఆ ఊరిలో పెను మార్పు వచ్చింది. దశాబ్దాలుగా పోలీసులు ప్రవేశించేందుకు వీలులేని గ్రామం పూవర్తి (Puvarthi) . చుట్టూర దట్టమయిన అడవులు, కొండలు ఉండటంతో ఇది పోలీసు దుర్బేధ్యమయిన గ్రామంగా ఉండింది. పోలీసులే కాదు, ఈ గ్రామంలోకి అభివృద్ధి కూడా రాలేకపోయింది. 2024లో జిల్లాపోలీ’iలు, కోబ్రా పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు, బస్తర్ ఫైటర్స్, సిఆర్ పిఎఫ్ సంయుక్తంగా పూవర్తిలో (All Armed Forces) క్యాంపు ఏర్పాటు చేశారు. అంతేకాదు, అక్కడ త్రివర్ణ పతాకం (Indian Flag Hoisted) కూడా ఎగరేసి గ్రామాన్ని అదుపులోకి తీసుకున్నారు.
HIDMA ENCOUNTER ఊరు విడిచిన తల్లి
ఈ పరిణామాల్లోనే హిడ్మా తల్లి (Hidma Mother) గ్రామం విడిచివెళ్లి పోయింది. కొన్ని రిపోర్టుల ప్రకారం, తాను పోలీసులకు అన్ని రకాల సహాకారం అందిస్తానని ఆమె చెప్పారు. ఈ గ్రామం సుక్మా జిల్లా , బీజాపూర్ జిల్లా సరిహద్దు సుక్మా పట్టణానికి 156 కిమీదూరాన ఉంటుంది. ఈ గ్రామం నుంచి హిడ్మాతోపాటు బర్సే దేవ (Barse Deva) అనే మరొక కమాండర్ కూడా ఉన్నారు. బస్తర్ అడవుల్లోని మావోయిస్టు దాడుల వెనక ప్లాన్లన్నీ వీళ్లిద్దరివేనని పోలీసుల అనుమానం.
HIDMA ENCOUNTER లొంగుబాటుకు తల్లి వేడుకోలు
ఇక పోలీసులకు లొంగిపోవాలని హిడ్మా తల్లి మొరపెట్టుకుంది. కన్నీళ్లు పెట్టుకుంది. జనంలో కలసి పని చేయాలని అభ్యర్థించింది. దీనికి తోడు గత అక్టోబరు 25 నుంచే హిడ్మా లొంగుబాటుపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. గత ఫిబ్రవరిలోనే ఆయన కుమార్తె జెన్నీ కూడా పోలీసులకు లొంగిపోయిన విషయం విధితమే. ఈ ఎన్ కౌంటర్ లో హిడ్మా దంపతులు మృతి చెందారు. హిడ్మా తలకు కోటి రూపాయలు, భార్య రాజే పేరిట 50 లక్షలు నజరానా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
HIDMA ENCOUNTER అంగరక్షకుల పట్టివేత

మారేడుమిల్లిలో అలా ఎన్ కౌంటర్ ముగిసిందో లేదో.. కృష్ణాజిల్లా పెనమలూరులో (Penamaluru) ఆక్టోపస్ దళాలు అలజడి సృష్టించాయి. హిడ్మా గెరిల్లా ఆర్మీకి చెందిన 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. దండకారణ్యంలో కగార్ ఆపరేషన్ నేపథ్యంలో.. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు విజయవాడను షెల్టర్ జోన్ (Maoists Shelter Zone) గా మలుచుకున్నారు. న్యూ ఆటోనగర్ లో (New Autonagar) షెల్డర్ ఏర్పాటు చేసుకున్నారు. హిడ్మా ఎన్ కౌంటర్ తో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది.
HIDMA ENCOUNTER పట్టించిన ఢైరీ

మావోయిస్టు అగ్ర నేత హిడ్మా (Hidma Encoutered Place) ఎన్ కౌంటర్ స్థలిలో ఒక డైరీ ఆధారంగా (Dairy) విజయవాడలో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ స్థానిక పోలీసులు ఆక్టోపస్ బృందాలు మంగళవారం తెల్లవారుజామున న్యూ ఆటోనగర్ లోని ఒక భవనాన్ని చుట్టుముట్టి అందులో ఆశ్రయం పొందిన మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు.
HIDMA ENCOUNTER షెల్టర్ జోన్ గుట్టురట్టు

విజయవాడకు చెందిన ఓ ప్రజా సంఘం మహిళ ప్రతినిధి విజయవాడ పరిధిలోని న్యూ ఆటోనగర్ లోని ఒక భవనంలో మావోయిస్టులకు గత నెల రోజులుగా ఆశ్రయం ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పీపుల్స్ ఆర్మీ గెరిల్లాకు (PLGA ) చెందిన 21 మంది మహిళలు (21 Women Maoists) ఏడుగురు పురుష (7 men) మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ కీలక నేత హిడ్మాకు (BodyGaurds) అంగరక్షకులని ప్రచారం జరుగుతోంది.

