Narcotics | మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి…

Narcotics | మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి…

Narcotics| నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నర్సింహులపేట ఎస్సై మాలోత్ సురేష్(Maloth Suresh) అన్నారు. ఈ రోజు నర్సింహులపేట మండల కేంద్రంలోని చౌరస్తాలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు దుర్వినియోగ నివారణ, వినియోగం తగ్గించే కార్యక్రమం నిర్వహించి ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు.

Narcotics|మత్తు పదార్థాలకు అలవాటు పడితే

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల(Narcotics) వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలపై యువత, విద్యార్థులు(Youth, Students) అవగాహన కలిగి ఉండాలని, మత్తు పదార్థాలకు అలవాటు పడితే విలువైన జీవితం కోల్పోవాల్సి వస్తుందన్నారు. మన సమాజం ఎదుర్కొంటున్న కీలక సమస్యలలో మాదకద్రవ్యాల వాడకం ఒకటని అన్నారు.

ప్ర‌తి ఒక్క‌రు సమాజం కోసం పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, స్థానిక ఆటో యూనియన్ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడుదుల రామకృష్ణ, కొండబత్తిని జగదీశ్వర్, మంచినీళ్ల రఘు, ఈరగాని ముత్తయ్య, మహబూబ్ పాషా, మస్తాన్ తదితరులు ఉన్నారు.

Narcotics | పోలీసుల ప్రతజ్ఞ

Leave a Reply