School | క‌లెక్ట‌ర్ ఆక‌స్మిక త‌నిఖీ…

School | క‌లెక్ట‌ర్ ఆక‌స్మిక త‌నిఖీ…

  • ప్రతి విద్యార్థి చదువును ఆస్వాదిస్తూ విద్యలో రాణించాలి..

Nagar Kurnool | నాగర్ కర్నూల్ ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : ఉన్నత చదువులకు పాఠశాల విద్య పునాదిలాంటిదని, ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై తరగతిగది బోధనలను ఆస్వాదిస్తూ విద్యలో రాణించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్(Collector Badawat Santhosh) అన్నారు.

ఈ రోజు బిజినపల్లి మండలంలోని మంగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల(High School, Primary School)ను కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ(Inspection) చేశారు. ఆయ‌న విద్యార్థులతో మాట్లాడుతూ… సబ్జెక్టుల వారీగా సిలబస్ ఎంతవరకు కొనసాగాయి, ప్రస్తుతం ప్రత్యేక తరగతులు ఎలా జరుగుతున్నాయి అనే అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు ప్రతి విద్యార్థికి అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

రానున్న పదవ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై ఉపాధ్యాయులు బోధించే ప్రతి అంశాన్ని శ్రద్ధగా విని పరీక్షలకు సన్నద్ధం కావాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయుడు(Teacher) పాఠ్యాంశాలను పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులు 100% పాఠశాల(100% School)కు ప్రతిరోజు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయుడు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

దీర్ఘకాలిక గైర్హాజరు(Chronic Absenteeism), సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థులకు అందజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట మండల తహసిల్దార్ మునుద్దీన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసింహ తదితరులు ఉన్నారు.

Leave a Reply