FIXED DIPOSIT :  వారసులకే పరిహారం  

FIXED DIPOSIT :  వారసులకే పరిహారం  

  • గృహ హింస.. వేధింపులు.. మరణాలను అరికట్టాలి
  • కృష్ణాజిల్లా కలెక్టర్​ డీకే బాలాజీ ఆదేశం

(మచిలీపట్నం – ఆంధ్రప్రభ)

వరకట్నం వల్ల జరిగే గృహ హింస, వేధింపులు, మరణాలను నివారించేందుకు ( Homicide, Harrasment, deaths cases )  అవసరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ (Collector DK Balaji)  అధికారులను ఆదేశించారు.

FIXED DIPOSIT

కలెక్టరేట్​ లో  సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన  బర్లో వరకట్న నిషేధ చట్టం, (Preventi Dowry Cases) 1961 జిల్లా సలహా మండలి కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ( Joint Collector Naveen)  తో కలిసి జిల్లాలో వరకట్న నిషేధ చట్టం  అమలు, వరకట్నం  కేసుల వివరాలు, బాధితులకు పరిహారం (Exgratia) చెల్లింపు, ఈ అంశాలపై  సమాజంలో అవగాహన కార్యక్రమాలపై  కమిటీ సభ్యులతో చర్చించారు.

 కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ  మాట్లాడుతూ,  వరకట్న నిషేధ చట్టం అమలుకు జిల్లా వరకట్న నిషేధ అధికారులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పోలీస్, (polce) మహిళా శిశు సంక్షేమ శాఖ, (ICDS) న్యాయ సేవల (Legal Services)  మధ్య సమన్వయాన్ని (Coordination)  మరింత బలోపేతం చేసే విధంగా కృషి చేయాలన్నారు. వరకట్నం వేధింపులతో మరణించిన బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లింపు పై కలెక్టర్ ఆరా తీశారు. ప్రస్తుతం 24 కేసులకు ( 24 Casees)   పరిహారం చెల్లించామని వివరిస్తూ, పరిహారం బాధితుల వారసులు,  సంరక్షకుల జాయింట్ ఖాతాకు ( Joint Bank Accounts)  పరిహారం జమ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇక  నేరుగా బాధితుల బిడ్డలకే Fixed  డిపాజిట్ చేయాలని 18 ఏళ్ల నిండిన తర్వాత నగదు ( Cash Maturity)  మెచ్యూరిటీ పొందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

సమావేశంలో డీఆర్ఓ కే చంద్రశేఖర రావు, ఐసీడీఎస్ పీడీ ఎం ఎన్ రాణి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పి వెంకటేశ్వరరావు, ఫాతిమా  మునిస్సా, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుశీల పాల్గొన్నారు.

Leave a Reply