Inflation | పెరుగుతున్న ద్రవ్యోల్బణం..

Inflation | పెరుగుతున్న ద్రవ్యోల్బణం..
కేంద్ర ఆర్థిక నివేదికలో వెల్లడి
నగదు చెలామణి మరింత తగ్గుదల
సేవలు, వస్తు ఉత్పత్తుల వినియోగాల్లో కోతలు
Inflation, హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర (State) ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో పయనిస్తోంది. ద్రవ్యోల్బణం ప్రభావంతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తోంది. నగదు చెలామణి తగ్గిపోతోంది. రాష్ట్రంలో ద్రవ్య చలామణిలో కోతలు పెరుగుతున్నాయి. సెప్టెంబర్లో ప్రతి ద్రవ్యోల్బణం -0.15 శాతంగా నమోదైన ట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నాలుగు నెలల వ్యవధిలో రాష్ట్రంలో మూడోసారి ప్రతి ద్రవ్యోల్బణం నమోదవ్వడం ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నది. తెలంగాణలో (Telangana) సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం 0.15 శాతంగా నమోదైంది. ఇందులో గ్రామీణ ప్రతి ద్రవ్యోల్బ ణం -0.29 శాతంగా ఉండగా.. పట్టణ ప్రాంతంలో -0.05 శాతం నమోదైంది. ఇదే సమయంలో జాతీయ సగటు ద్రవ్యోల్బణం 1.54 శాతంగా ఉన్నది. తొలిసారిగా జూన్లో ఆర్థిక మాంద్యం ప్రభావం -0.93 శాతంగా నమోదైంది. ఆ మరుసటి నెల జూలైలోనూ డిఫ్లేషన్ -0.44 శాతంగా రికార్డ య్యింది. ఇప్పుడు సెప్టెంబర్ లో మళ్లీ 0.15 శాతం నమోదైంది. ఆరోగ్యకరమైన ఆర్థిక వృద్ధి కోసం ద్రవ్యోల్బణ రేటు 2-6 శాతం మధ్య ఉండాలని రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) లక్ష్యంగా పెట్టుకున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా ఎదుర్కొంటున్న సవాళ్లు మరింత తీవ్ర మవుతున్నాయని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాజా రిపోర్ట్ హెచ్చరిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఏప్రిల్-సెప్టెంబర్ వరకు ఫిస్కల్ డెఫిసిట్ రూ.45,139 కోట్లకు చేరింది. ఏడాది మొత్తం మీద ఈ లోటు రూ.54,010 కోట్లు మాత్రమే ఉంటుందని అనుకున్నారు. కానీ ఆరు నెలల్లోనే 83.58 శాతం లోటు నమోదయింది. రెవెన్యూ డెఫిసిట్ రూ.12,453 కోట్లకు పెరిగింది, రెవెన్యూ కలెక్షన్లు అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి.
అంచనాలను అందని ఆదాయం..
కాగ్ రిపోర్ట్ ప్రకారం, (CAG Report) మొదటి ఆరు నెలల్లో మొత్తం రెవెన్యూ రసీదులు రూ.1.22 లక్షల కోట్లు వచ్చాయి. ఇది వార్షిక అంచనా రూ. 2.85 లక్షల కోట్లలో 42.87 శాతం మాత్ర మే. వ్యయాలు రూ.89,394 కోట్లకు చేరాయి. ఇందులో జీతాలు, పెన్షన్లు, సబ్సిడీల పై ఖర్చు పెరుగుతోంది. జీతాలు రూ. 23,954 కోట్లు, సబ్సిడీలు రూ. 8,124 కోట్లు ఉంది. అప్పులు రూ.45,139 కోట్లకు చేరాయి. ఇది వార్షిక టార్గెట్ అంచనాలో 84 శాతం. డెట్ సర్వీసింగ్ ఖర్చు రూ.14,371 కోట్లకు పెరిగింది. జీఎస్టీ కలెక్షన్లు రూ.25,411 కోట్లుతో 42.56 శాతం ఉండగా, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ కలెక్షన్లు తగ్గాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూ. 22,209 కోట్లు మాత్రమే. ఇది ఆర్థిక వృద్ధికి అడ్డంకిగా మారింది.
అసలేమిటీ ద్రవ్యోల్బణ పరిస్థితులు..
ఆర్థిక వ్యవస్థలో వస్తువులు, సేవల ధరలు సమయానుకూలంగా పెరుగడాన్ని ద్రవ్యోల్బణంగా చెప్తారు. ద్రవ్యోల్బణం అధికంగా పెరిగితే.. వస్తువులు, సేవల ధరలు ఆకాశాన్ని అంటు తాయి. ఒకవేళ ద్రవ్యోల్బణం ఒక పరిధివరకూ తగ్గితే ధరలు తగ్గుతాయని చెప్పొచ్చు. అయితే.. అదే ద్రవ్యో ల్బణం మైనస్లోకి వెళ్తే అది డిఫ్లేషన్ స్టేట్లోకి జారినట్టు ఆర్థిక నిపుణులు చెప్తారు. నెగెటివ్ ద్రవ్యోల్బణం నమోదు చేసిన రాష్ట్రంలో ధరలు తగ్గడం అటుంచితే.. వస్తు, సేవలను వినియోగించు కొనే ప్ర జల కొనుగోలు శక్తి క్షీణించిం దని, ప్రస్తుతం సెప్టెంబర్ లో తెలంగాణ ద్రవ్యోల్బణ రేటు మైనస్ 0.15 శాతానికి పడిపోయిందని పేర్కొంటున్నారు. తైలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ
గానే ఉన్నాయి. కూరగా యలు, నూనె, నిత్యావ సరాల ధరల్లో మార్పు లేదు. ద్రవ్యోల్బణం (Inflation) నెగటివ్కు చేరిందంటే.. వస్తోత్పత్తులను కొనుగోలు చేసే పౌరుల ఆర్థికశక్తి తగ్గిపోయిందని భావిస్తున్నారు. అంటే ప్రజల ఖర్చు సామర్థం క్షీణించినట్టే. వినోదం, టూరిజంపై ప్రజలు చేస్తున్న ఖర్చు తగ్గిందని నిపుణులు అంటున్నారు. ఇది కేవలం ద్రవ్యోల్బణ నియంత్రణ కాదు.. ఇది ఆర్థిక వ్యవస్థ కుప్పకూ లడానికి సంకేతమని, ఇది గణాంకాల్లో S “నిపించే నెగటివ్ నంబర్ల కన్నా చాలా ప్రమాదకరమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోజువారీ ఖర్చులకూ అప్పులపైనే ఆధారం..
ప్రభుత్వం ఆదాయం పై కాకుండా అప్పులపై ఎక్కువగా ఆధారపడుతోందని అర్థమవుతోంది. ఫిస్కల్ డెఫిసిట్ వేగం గా పెరగడం వల్ల రాష్ట్రం ఎఫ్ఆర్బీఎం పరిధులను దాటిపో యే ప్రమాదంలో పడింది. రెవెన్యూ డెఫిసిట్ పెరగడం రోజువారీ ఖర్చులు కూడా అప్పులతోనే గడవాల్సిన పరిస్థితిని సూచిస్తోంది. జీడీపీలో పెరుగుదల తక్కువ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగించింది.
భూముల అమ్మకాలపై ఆశలు..
అప్పులు కూడా సరిపోకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం భూముల అమ్మకాలపై ఆశలు పెట్టుకుంది. ప్రభు త్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భూముల అమ్మకాలు, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.25,000 కోట్లు ఆదాయం పొందాలని ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ (Hyderabad) మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ భూముల వేలాల ద్వారా వేల కోట్లు సంపాదించే ప్లాన్ చేసుకుంటోంది. కొకాపేట్, మూసాపేట్ ప్రీమియం ప్రాంతా ల్లో 44 ఎకరాల భూములు ఈ-ఆక్షన్కు ఉంచారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జరిగే ఈ వేలాల్లో కనీస ధర ఎకరానికి రూ.70-99 కోట్లు నిర్ణయించారు. ఇప్పటి రాయదుర్గంలో ఎకరాకు రూ. 170 కోట్లకు చొప్పున విక్రయించారు.
