Nallagonda | రన్ ఫర్ సోషల్ జస్టిస్

Nallagonda | న‌ల్ల‌గొండ‌, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపుమేరకు న‌ల్ల‌గొండ‌ ఎన్జీ కాలేజీ గ్రౌండ్(Nallagonda NG College Ground)లో జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జిల్లా జేఏసీ చైర్మన్ చక్రహరి రామరాజు(Chakrahari Ramaraju) మాట్లాడుతూ బీసీలు సామాజికంగా అన్నిరంగాలలో వివక్షకు దోపిడీకి గురవుతూనే ఉన్నారని అన్నారు. బీసీలు ఇప్పటికైనా మేల్కొని ఐక్యంగా మన హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కేశ బోయిన శంకర్ ముదిరాజ్(Kesha Boina Shankar Mudiraj, కాసోజు విశ్వనాథం, నకరికంటి కాశయ్య గౌడ్, చిక్కుల రాములు, జె ఇంద్రయ్య, కంది సూర్యనారాయణ, నాగులపల్లి శ్యాంసుందర్, బొమ్మరబోయిన కేశవులు, వాడపల్లి సాయిబాబా, జెల్లా ఆదినారాయణ, వెంకటేశ్వర్లు పసుపులేటి సీతారాములు కొల్లోజు సత్యనారాయణ భాస్కర్, కాసోజు శంకరాచారి(Kasoju Shankarachari), చిన్న శంకరాచారి, ఉద్యోగుల సంఘం నుండి సమీర్ శంకర్, మహిళా సంఘం నుండి మాధవి విద్యార్థి సంఘం నల్ల మధు యాదవ్ శివ లింగస్వామి గౌడ్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply