భక్తిశ్రద్ధలతో కార్తీక సహస్ర దీపోత్సవం…

కంటోన్మెంట్, ఆంధ్రప్రభ : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని న్యూ బోయిన్‌పల్లి సీతారాంపురంలోని శివపంచాయతీ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం సహస్ర దీపోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో.. పెద్దసంఖ్యలో పాల్గొన్న స్థానిక మహిళలు ఆలయ ఆవరణలో వివిధ ఆకారాలతో ఏర్పాటు చేసిన దీపాలను వెలిగించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, ఆయన భార్య విద్యావతి పూజలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా, శ్రీకాంత్, మనోహర్ రావు, రాజేందర్, ప్రకాష్, సంగీత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply