Parakamani murder | నిజాన్ని చంపేశారు..
- పరకామణి కుతంత్రం
- పక్కా ప్లాన్ తో మాజీ ఏవీఎస్ వో మర్డర్

ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి : ఇతడు.. అతడే. పేదింట బిడ్డ. ఆకలి మంట తెలుసు. కొడుకు మారాజు కావాలని అమ్మానాన్న కోరుకున్నట్టే, చేతిలో పైసా లేదు. లంచం ఇవ్వలేని స్థితి. పెత్తందారుల రికమండేషన్ కోసం వెంపర్లాడలేదు. ఏపీఎస్పీలో కానిస్టేబుల్ (apsp conistable) ఉద్యోగం సాధించాడు.
కొన్నాళ్లకే సబ్ ఇన్స్ పెక్టర్ హోదా పొందాడు. అన్నిటి కంటే.. తిరుమల తిరుపతి దేవస్థానంలో అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసరుగా ( TTD A.V.S.O) ఏడున్నర సంవత్సరాలు.. నిజాయితీకి .. నిబద్ధతకు నిలువెత్తు పోలీస్ ఆఫీసర్ గా నిలిచారు. న్యాయానికి (justice) , ధర్మానికి , చట్టానికి (constitution) కంకణ బద్ధుడై.. కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకన్న స్వామి హుండీ దొంగను పట్టుకున్నాడు.
కానీ రాజకీయ చట్రంలో చిక్కాడు. పొలిటికల్ చెస్ గేమ్ (political game) లో బంటుగా బలయ్యాడు. ఇదీ తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక సాక్షి టీటీడీ మాజీ AVSO (అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్) సతీష్‌కుమార్ దారుణ హత్య ..తెరవెనుక ఇన్ సైట్ (in sight story) మర్డర్ స్టోరీ .
ఇతడు… అతడే

ఎవరీ సతీష్ కుమార్ ? (satish kumar) పరకామణి కేసుతో సంబంధమేంటీ? నవంబర్ 14న అర్ధరాత్రి గుంతకల్ లో రాయలసీమ ఎక్స్ ప్రెస్ (rayalaseema) లో తిరుపతికి బయలుదేరిన ఇతడు, అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి , జుటూరు రైల్వే ట్రాక్‌పై ( between komali..juturu railway) శవం ఎలా ప్రత్యక్షమైంది. ముఖంపై కమిలిపోయిన గాయాలేంటీ? కాళ్లకు చెప్పులేవి? రైల్వే ట్రాక్ కు ఇంత దూరం ఎలా పడ్డాడు? శవాన్ని ఈడ్చుకు వెళ్లినట్టు.. వీపుపై ఆ గాయం ఏమిటీ?
ఇంతకీ ఆయన ఆత్మహత్య (sicide) చేసుకున్నాడా? లేక చంపేసి (murder) పడవేశారా? అనే ప్రశ్నలు సర్వసాధారణమే. కానీ పోలీసు ఇన్వెస్టిగేషన్ లో.. ఇది ముమ్మాటికీ హత్యేనని తేలింది. ఈ విషయాన్ని అధికారికంగా దర్యాప్తు బృందం చెప్పదు. చెప్పలేదు.
ఈ నిజాన్ని చెప్పేది కచ్చితంగా సతీష్ కుమార్ మృతదేహమే. ఇక పోస్టుమార్టం (Postmortem) చేసే వైద్యులు కూడా టెక్నాలజీ (technalogy) దిశగా అడుగులు వేయటం విశేషం. సతీష్ కుమార్ మృతదేహాన్ని స్కానింగ్ చేసిన తరువాతే (after scaning) పోస్టుమార్టం తతంగాన్ని ముగించారు. మరి కొన్ని గంటల్లోనే.. ఆయన హత్య సమాచారం అఫీషియల్ గా పోలీసు అధికారులకు చేరుతుంది.
సతీష్ అంటే..
పత్తికొండ పట్టణంలోని కుమ్మరి వీధిలో (kummari street) పుట్టాడు. అమ్మ చిదంబరమ్మ, (chidambaramma) నాన్న బ్రహ్మయ్య (brahmaiaiah). వీరి తొలిసూరు బిడ్డే సతీష్ కుమార్. నాన్న హాస్టల్ లో వంట మనిషి (hostel coock). ఇద్దరు కొడుకుల్ని చదివించాడు. సతీష్ ని మాత్రం పోలీస్ కావాలని నాన్న తపించాడు. ఆలస్యంగానైనా. నాన్న కోసం, నాన్నకు ప్రేమతో ఏపీఎస్పీ కానిస్టేబుల్ conistable) ఉద్యోగం సాధించాడు. అనతికాలంలోనే ఎస్ఐ పరీక్షల్లో ఆర్ఎస్ఐ (reserve sub inspector) సంపాదించాడు. కర్నూలు ఆడబిడ్డ మమత (mamatha)ను పెళ్లాడాడు. ఈ దంపతులకు ఇద్దరు బిడ్డలు. చిన్న సంసారం. చీకు చింతలేని కుటుంబం.. ఎలా దెబ్బతిందంటే..
హుండీ దొంగ దొరికాడు
తిరుమల పరకామణిలో TTD parakamani) 2023 ఏప్రిల్‌లో సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ (ravi kumar) చోరీ చేస్తుండగా ఏవీఎస్వో సతీష్‌కుమార్ తట్టుకోలేకపోయాడు. రెడ్ హ్యాండెడ్ గా (picked red handed) పట్టుకున్నారు. రవికుమార్ వస్త్రంలో 920 డాలర్లు (dollars) దొరికాయి. 2023 మే 30న రవికుమార్ పై విజిలెన్స్ అధికారులు ఛార్జ్‌షీట్ ఫైల్ 9charge sheet filed) చేశారు. ఇంకేముందీ.. తిరుమలలో తిష్టవేసిన రాజకీయ రక్షక భటులు .. సారీ.. భక్షక భటులు తెరమీదకు వచ్చారు.
ప్రపంచంలోనే మేటి పుణ్యక్షేత్రంలో హుండీ చోరీ కేసు విచారణపై రాజీ ఫార్ములాను ( settlement formula) ప్రయోగించారు. ఫిర్యాదు, నిందితుడి మధ్య లోకాయుక్త వేదికగా (lokayukta) అతి చిన్న కేసు తరహాలో సెటిల్ మెంట్ చేశారు. ఈ సెటిల్ మెంట్ లో ప్రధాన నిందితుడు ఓ వంద కోట్ల ఆస్తిని బ్యాక్ డోర్ లో అప్పటి తిరుమల పెద్దలకు సమర్పించారని ఇప్పటికీ లోకులు కాకుల్లా కావ్ కావ్ అంటున్నారు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే..
పరకామణిలో ప్రకంపన

కూటమి సర్కారు ( NDA government) రాకతో.. పరకామణిలో ప్రకంపనం ప్రారంభమైంది. ( Parakamani shaked) పరకామణి చోరీ కేసును అంతు తేల్చేందుకు సర్కారు పావులు కదిపింది. మరి కొందరు కోర్టు మెట్లు ఎక్కారు. అతి చిన్న చోరీ కేసుగా ఎలా నిర్ధారించారు? లోకాయుక్తాలో రాజీమంత్రం ఎలా పని చేసిందో తెలుసుకోవటానికి .. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (entered SIT) హైకోర్టు రంగంలోకి దించింది. ఇక అసలు దొంగల్లో భయం తప్పలేదు. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తు కీలక దశకు incestigatoin speed) చేరింది. శుక్రవారం టీటీడీ అధికారులను సీఐడీ బృందం విచారించింది.
తిరుపతి పద్మావతి అతిథిగృహంలో టీటీడీ జేఈవో (TTD JEO) వీరబ్రహ్మం, ఆర్థిక సలహాదారు, ముఖ్య గణాంకాధికారి (cheaf statistics officer) బాలాజీ, అప్పటి వీజీవో (Vgo) బాలిరెడ్డి, అప్పటి తిరుమల సీఐ (tirumala Ci) చంద్రశేఖర్‌ను విచారించారు ఈ కేసులో నిందితుడు రవికుమార్‌ను పట్టుకున్న రోజు (2023 ఏప్రిట్ 29న) విధుల్లో ఉన్న ఐదుగురు పరకామణి సిబ్బందిని, పెద్ద జీయర్ (pedda jiyyar mtam) మఠంలోని ముగ్గురు స్వాములతో కలిపి మొత్తం 12 మందిని అధికారులు విచారించారు.
తొలుత జేఈవో వీరబ్రహ్మంతో జరిగిన విచారణలో ‘పరకామణి లెక్కింపునకు ప్రైవేట్ మఠాలైన (private matalu) పెద్ద జియ్యర్, చిన్న జియ్యర్ (china jiyyar ) మఠం ఉద్యోగులను ఎలా అనుమతించారు? రవికుమార్ ఆస్తులను స్వాధీనం చేసుకునే అంశాన్ని పాలకమండలి సమావేశంలో ఎవరు పెట్టమన్నారు? టేబుల్ అజెండా (tabblr agenda) పెట్టడానికి టీటీడీలో ఉండే నిబంధనలేంటి?’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను తిరుపతి పరిపాలన చేస్తారని వీరబ్రహ్మం చెప్పినట్టు తెలిసింది.
ఇక బాలిరెడ్డిని విచారిస్తూ ‘మీ సబ్‌ఆర్డినేట్, అప్పటి ఏవీఎస్ వో సతీశ్ కుమార్ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత రవికుమార్‌ను విచారించారా? రాజీ విషయంలో అప్పటి సీవీఎస్ ఓ (CVSO) పాత్ర ఉందా? టీటీడీకి డిప్యుటేషన్‌పై (deputation) వచ్చేందుకు ఎవరు సపోర్ట్ చేశారు? అని ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. తనకు తెలియదని ఎక్కువ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తుడటంతో, కొండపై కీలక స్థానంలో ఉండి, తెలియదంటే ఎలా అంటూ, మళ్లీ పిలుస్తాం. రండి అపి విచారణాధికారి చెప్పినట్టు సమాచారం.
ఇదే మరణశాసనం

ఇక్కడి నుంచే సతీష్ మరణశాసనం (death conviction) తెరమీదకు వచ్చింది. అతడు మాట్లాడితే.. అసలు దొంగలు బోనులెక్కాల్సిందే. తిరుమల తిరుపతిని దొంగల స్థావరం చేసిన రాజకీయ నాగుల పడగలు చితికి పోతాయి. ఇలాంటి స్థితిలోనే ఓ మేటి ఆఫీసర్ ను (murdered brutally) అత్యంత కిరాతకంగా చంపేశారు. నిజాన్ని సమాధి చేసే ప్లాన్ plan for pact buried) వేశారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ భుజాలను తడుముకొంటున్నాయి. రవికుమార్, సతీష్ కుమార్ మధ్య రాజీతంత్రంలో కుటిలత్వం వెలుగు చూడటం ఖాయమే. అందుకే సతీష్ కుమార్ పై అత్యంత కిరాతకంగా దాడి చేసి చంపేసి.. రైల్వే ట్రాక్ పక్కన పడేశారు. ఈ విషయం అతి త్వరలోనే వెలుగులోకి వస్తుంది. ఇది నిజం నిజం .

