Died | చెరువులో మునిగి విద్యార్థి….
Died | సోంపేట (శ్రీకాకుళం) ఆంధ్రప్రభ : సోంపేట మండల రుషికుడ్డ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు చాకలి చెరువుకి స్నానానికి వెళ్లి బుడ్డ హర్ష (15) ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసుల సహకారంతో మృతదేహాన్ని బయటకు తీశారు. సోంపేట పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్నిపోస్టుమార్టం కోసం సోంపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు.

