Telangana | ఘనంగా జన్మదిన వేడుకలు.

Telangana | ఘనంగా జన్మదిన వేడుకలు.
Telangana | దండేపల్లి, ఆంధ్రప్రభ : భారత ప్రధాని పండిత్ జవహార్ లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గుడిరేవు ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బండారి శ్రీనివాస్(Bandari Srinivas) మాట్లాడుతూ.. నెహ్రూ మన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
జవహర్ లాల్ నెహ్రు పిల్లలు అంటే ఎనలేని ప్రేమ అని, ఎక్కడికెళ్లినా ముందుగా పిల్లలతో గడిపే వాడని తెలిపారు. సమావేశానికి విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు హాజరయ్యారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతోని ఆనందంగా గడిపారు. ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సగ్గిడి. లక్ష్మి(Saggidi. Lakshmi), ఉపాధ్యాయులు రాజశేఖర్, అనిత, సల్మా లచ్చన్న, కర్నే నరేందర్, ఖండు తదితరులు పాల్గొన్నారు.
