Warangal | నిబంధనల మేరకే విక్రయించాలి

Warangal | నిబంధనల మేరకే విక్రయించాలి

  • అతిక్రమిస్తే చర్యలు తప్పవు
  • క్రయ,విక్రయాల్లో బిల్లులు తప్పనిసరి
  • ప్రెస్క్రిప్షన్ మేరకు మాత్రమే మందులు అమ్మాలి

Warangal | వరంగల్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఆసుపత్రులకు అనుబందంగా ఉన్న ఔషద దుకాణాలపై, రక్తనిది కేంద్రాలపై ఉమ్మడి వరంగల్ జిల్లా సహాయ సంచాలకులు, ఔషద నియంత్రణ పరిపాలన హనుమకొండ ఔషద తనిఖీ అధికారి జన్ను కిరణ్ కుమార్, భూపాలపల్లి అధికారిణి పావని, జనగామ అధికారి బాలకృష్ణ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి ఔష‌దాలు, సౌందర్య సాధనల చట్టం 1940, నిబంధనలు 1945 లోని నిబంధన 65 ను ఉల్లంఘించినందులకు గాను పలు హాస్పటల్ అనుబంధ ఫార్మసి లకు తాఖీదులకు సిపారసు చేశారు.

ప్రతీ కొనుగోలు దారుడికి సేల్ బిల్ తప్పకుండ ఇవ్వాలని సూచించారు. రికార్డ్స్ పరిశీలించి, నాణ్యత పరీక్షల నిమిత్తం కొన్ని రకాల‌ మందులను ప్రభుత్వ ప్రయోగ శాలకు పంపించారు. ఎవరైనా అధిక ధరలకు మందులను విక్రయించినా, బిల్ ఇవ్వకపోయినా లేదా ఇతరత్ర సేవా లోపాలున్నా ఔషద తనిఖీ అధికారికి పిర్యాదు చేయవచ్చు అని అన్నారు.

ఈ సందర్బంగా మత్తు, అలవాటు కలిగించే మందులు అర్హత గల వైద్యుని ప్రెస్క్రిప్షన్ పైన మాత్రమే అమ్మాలని, గర్భ విచ్చిత్తి మందులు అర్హత గల వైద్యుని పర్యవేక్షణలో వాడాల్సిన అవసరం ఉందని, అర్హత లేని వైద్యులకు, లైసెన్స్ లేని వారికీ పంపిణీ దారులు ఔషదాలు విక్రయించ వద్దని, ఎవరైనా ఔషద చట్టం నిబంధనలు ఉల్లంఘించినచో క్రిమినల్ చర్యలకు బాద్యులు అవుతారని ఈ సందర్బంగా హౌషద తనిఖీ అధికారి జన్ను కిరణ్ కుమార్ హెచ్చరించారు.

Leave a Reply