Seethakka | రూ.13 కోట్లతో ద్వీపం అభివృద్ధి పనులు

శంకుస్థాప‌న చేసిన మంత్రి సీతక్క

Seethakka | ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట (రామప్ప సరస్సు)లో రూ.13 కోట్ల నిధులతో ద్వీపం అభివృద్ధి పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, టూరిజం ఇంజనీరింగ్ డీఈ ధనరాజ్, ఏఈ విజయ్, తహసీల్దార్ గిరిబాబు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply