Gandhi | ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం..

Gandhi | ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం..

హైదరాబాద్, ఆంధ్రప్రభ – Gandhi ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ (Gandhi) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి సంఘీభావంగా గాంధీ జ్ఞానప్రతిష్టాన్ సంస్థ లక్ష విగ్రహాల ప్రదర్శనకు కార్యచరణ రూపొందించిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌ గౌడ్ (Mahesh Goud) వెల్లడించారు. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వర్ణోత్సవాలు సందర్భంగా సంస్థ చేపట్టిన బాపు బాట ప్రచార రథాన్ని
టీపీసీసీ చీఫ్ బుధవారం గాంధీ భవన్ లో జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ (Gandhiji) సిద్ధాంతాలను భావి తరాలకు తెలియచేసేందుకు జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థ నిర్ణయం తీసుకోవడం అభినందించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లక్ష విగ్రహాల ప్రదర్శనను ఏర్పాటు చేయడమే కాకుండా వాటిని పాఠశాలలు, గ్రంధాలయాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం చారిత్రక నిర్ణయమని చెప్పారు.

ఈ కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీపరంగా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ప్రచార రథం ద్వారా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో గాంధీ సిద్దాంతాలను ప్రచారం చేయనున్నట్టుగా రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థ ఛైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, గాంధీ విజ్ఞాన కేంద్రాల కమిటీ ఛైర్మెన్ గాంధారి ప్రభాకర్, వైస్ ఛైర్మెన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మెన్ దీపక్ జాన్, ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మెన్ కల్వ సుజాత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply