delhi 12 people అది.. ఉగ్ర‌వాదుల ప‌నే!

  • పోలీసులే కాదు…
  • యావ‌త్ దేశ‌ప్ర‌జ‌ల భావ‌న‌..
  • ఆ కోణంలోనే ద‌ర్యాప్తు..
  • నేపాల్‌, బంగ్లాదేశ్‌లో శిక్ష‌ణ శిబిరాలు..
  • ఇంటిలిజెన్స్ హెచ్చ‌రికా..
  • ఇంత‌లోనే ఢిల్లీలో బాంబు పేలుడు…
  • 12 మంది బ‌లి!

delhi 12 people | వెబ్ ఆంధ్ర‌ప్ర‌భ : ఢిల్లీలో ఎర్ర‌కోట స‌మీపాన మెట్రో స్టేష‌న్(Metro station) వ‌ద్ద జ‌రిగిన పేలుడు ఘ‌ట‌న‌లో 12 మంది మృతి చెందారు. మ‌రో 17 మందికి గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న ఉగ్ర‌వాదుల ప‌నే అని పోలీసుల‌తోపాటు యావ‌త్ భార‌త‌దేశ ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఆ కోణంలోనే ద‌ర్యాప్తు ప్రారంభ‌మైంది. ఈ ద‌ర్యాప్తులో ఉగ్ర‌వాద సంస్థ ప‌నే అని మూల‌లు దొరికాయి.

కారులో ఆత్మాహుతి ద‌ళం(Suicide Squad) ఈ ఘాతుకానికి పాల్ప‌డిన సంగ‌తి పోలీసులు గుర్తించారు. సాధార‌ణంగా ఆత్మ‌హుతి ద‌ళాలు ఉగ్ర‌వాదుల చేతిలోనే ఉంటాయి. జ‌మ్మూ క‌శ్మీర్ రాష్ట్ర‌ పరీదాబాద్ మాడ్యూల‌కు చెందిన డాక్ట‌ర్‌ ఉమర్ మహ్మద్(Umar Mohammed) కూడా కారులోనే ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పేలుడులో అతడు మరణించి ఉంటాడని భావిస్తున్నారు.

ఇది ఆత్మాహుతి దాడిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేపాల్‌లోని ఉగ్ర సంస్థలు లష్కరే తయ్యిబా (ఎల్ఈటీ), జైషే మహమ్మద్ త‌మ సంస్థ‌ను విస్త‌రిస్తున్నార‌ని, అలాగే బంగ్లాదేశ్‌లో అల్‌-ఖైదా, ఐసీస్ త‌మ కార్య‌క‌లాపాల‌ను విస్త‌రించ‌డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నాయ‌ని నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రించిన రెండు రోజుల్లోనే ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది.

దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో ఉగ్ర కుట్ర ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడుకు కారణమైన కారును చివరిగా కశ్మీర్ లోని పుల్వామా(Pulwama, Kashmir)కు చెందిన వైద్యుడు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతనికి రీదాబాద్లోని మాడ్యూల్లో సంబంధాలు ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఉగ్ర సంస్థలు లష్కరే తయ్యిబా (ఎల్ఈటీ), జైషే మహమ్మద్ నేపాల్‌లో తమ సంస్థలను విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అల్-ఖైదా(Al-Qaeda), ఐసిస్ గత ఐదు నెలలుగా బంగ్లాదేశ్‌లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపాయి. ఇందులో భాగంగా పాక్ లోని పలు ప్రాంతాల నుంచి బంగ్లాకు, నేపాలు నిరంతరం వలసలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి.

ఆయా దేశాల్లో ఉగ్రవాద శిబిరాల నిర్మాణాల(Terrorist Camp Structures)కు, నిర్వహణకు కావాల్సిన నిధులను తుర్కియే అందిస్తున్నట్లు సమాచారం. ఢాకాలోని జమాత్-ఇ-ఇస్లామీ కార్యాలయం పునరుద్ధరణకు తుర్కియే నిఘా సంస్థ నిధులు సమకూర్చినట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపాయి.

ఈ క్ర‌మంలోనే నిషేదిత జైషే మహ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థల(Ansar Ghazwat-ul-Hind Terrorist Organizations)తో సంబంధం ఉన్న ఎనిమిది మంది అరెస్టు చేసినట్లు సోమవారం జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురు వైద్యులు అదీల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహిన్ ఉన్నారు. వారిలోని మహిళా డాక్ట షాహిన్ సోమవారం లబ్నవూలో అరెస్టు కాగా ఆమె కారు నుంచి ఏకే-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు.

కశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్, కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్(Sulfur including Potassium Nitrate) కూడిన 2,900 కిలోల పేలుడు పదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. మరోపక్క గుజరాత్‌లో భారీ ఉగ్ర కుట్రకు ప్రయత్నించిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌తో పాటు మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ కూడా ఒక డాక్టర్ కావడం గమనార్హం. ఈ పరిణామాల వేళ ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తన సహచరుల అరెస్ట్, బాంబు తయారీలో వాడే పేలుడు పదార్థాల స్వాధీనంతో నిరాశ చెందిన అతడు ఈ పేలుడుకు పాల్పడి ఉండొచ్చన్న కోణాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు దుర్ఘ‌ట‌న‌పై భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రస్తుతం భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ థింపూ సమావేశం(Prime Minister Modi’s Thimphu Meeting)లో మాట్లాడుతూ.. ఢిల్లీ పెలుడు కుట్రకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని, కుట్ర వెనుక ఉన్నవారిని కూడా వదిలే ప్రసక్తే లేదని హెచ్చ‌రించారు. “ఈ రోజు నేను చాలా బరువెక్కిన హృదయంతో ఇక్కడికి వచ్చాను.

నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన దారుణ సంఘటన అందరినీ తీవ్ర బాధకు గురిచేసింది. బాధిత కుటుంబాల బాధను నేను అర్థం చేసుకున్నాను. ఈ రోజు మొత్తం దేశం వారితో నిలుస్తుంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న అన్ని సంస్థలతో నేను నిన్న రాత్రంతా సంప్రదిస్తున్నాను. మా ఏజెన్సీలు ఈ కుట్రను లోతుగా పరిశీలిస్తాయి. దీని వెనుక ఉన్న కుట్రదారులను వదిలిపెట్టబోం” త్వరలోనే నిందితులు బయటపడతారని ఈ సందర్భంగా ప్రధాని మోడీ చెప్పారు.

ఇది కూడా చదవండి దద్దరిల్లిన ఢిల్లీ..

https://twitter.com/search?q=deli%20blast&src=typed_query&f=live

Leave a Reply