వారం రోజులు  ఊరించి..

అకస్మాత్తుగా  పెరిగిన బంగారం ధర

( ఆంధ్రప్రభ, బిజినెస్​ డెస్క్) ​

మదుపుర్లకు గత వారం బంగారం ధరలు  షాక్ ఇస్తే.. పసిడి ప్రియులకు బులియన్​ మార్కెట్​ ధరల వల విసిరింది. ఫలితంగా.. ఈ రోజు (10.11.2025) బంగారం ధర అకస్మికంగా పెరిగింది. పది గ్రాముల మేలిమి బంగారం ( 24 క్యారెట్ల బంగారం)  ధర  .1800  పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర .1,650, 18 క్యారెట్ల బంగారం ధర ₹ 1350లు పెరిగింది. గత సోమవారం (3.11.2025) నుంచి ఆదివారం వరకూ బంగారం క్రయ, విక్రయాలను పరిశీలిస్తే.. ఈ వారంలో గ్లోబల్ మార్కెట్ ఒత్తిళ్లు తగ్గాయి.  డాలర్ విలువ పెరిగింది.  రేట్ కట్ పెరిగే వీలు లేక పోవటంతో.. బంగారం ధరలు పడిపోయాయి.  24 క్యారెట్ (999 ప్యూర్) బంగారం ధర  సగటున ₹9.000 నుంచి ₹ 12,000లు తగ్గింది. ఈ స్థితిలో మదుపర్లు వెనకడుగు వేయటంతో.. దేశీయ పసిడి ప్రియులు బంగారు దుఖాణాలకు పరుగులు పెట్టారు. ఈ డిమాండుతో సోమవారం ధర పెరిగింది. గత వారం రోజులుగా బంగారం ధర పతనావస్థ పరిశీలిస్తే..  నవంబర్ 3 న  ₹1,22,990 లు పలికిన 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల బంగారం ధర  నవంబర్ 4 న : ₹1,22, 460కి చేరింది. అంటే ₹530లు  తగ్గింది . నవంబర్ 5 న  – ₹1,21,910లకు చేరింది. అంటే ₹ 510లు తగ్గింది.  నవంబర్​ 6న   24 క్యారెట్ల బంగారం పది గ్రాముల బంగారం నుంచి ₹122,170  కు చేరి ₹260 పెరిగింది. నవంబర్ 7న   ₹1,22,020 లకు చేరి   ₹150 తగ్గిందినవంబర్ 8 న  ₹1,22,020 (స్థిరం)  నవంబర్ 9న  ₹122,02 0  స్థిరంగా ఉంది. నవంబర్​ 10న ₹1,23,820కు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం కూడా గత వారంహెచ్చు తగ్గులతో ఊగిసలాట ఆడింది. సోమవారం ₹ 1,13,500కి పెరిగింది. 18 క్యారెట్ల బంగారం ధర ₹ 92,870లకు చేరింది.

(సమాచారం: నవంబర్​ 10, 2025 నాటి మార్కెట్ డేటా ఆధారంగా)

నగరం                       24 క్యారెట్స్                         22 క్యారెట్స్                                     18 క్యారెట్స్

హైదరాబాద్             1,23,820లు      1,13,500 లు     92,870లు

వరంగల్                   1,23,820లు      1,13,500 లు     92,870లు

విజయవాడ             1,23,820లు      1,13,500 లు     92,870లు

గుంటూరు                1,23,820లు      1,13,500 లు     92,870లు

విశాఖపట్నం           1,23,820లు      1,13,500 లు     92,870లు

 చెన్నై                          1,24,480లు      1,13,100లు      95,150లు

కోల్కత్త                     1,23,820లు      1,13,500 లు     92,870లు

ముంబై                       1,23,820లు      1,13,500 లు     92,870లు

ఢిల్లీ                             1,23,970లు      1,13,650 లు     93,020లు  బెంగళూరు                        1,23,820లు      1,13,500 లు     92,870లు

కేరళ                          1,23,820లు      1,13,500 లు     92,870లు

అహ్మదాబాద్           1,23,87 0లు     1,13,550లు      92,920లు

 వడోదర                    1,23,87 0లు     1,13,550లు      92,920లు

Leave a Reply