పాముకాటుతో పాడి గేదె మృతి

రూ.60 వేల నష్టం

మోత్కూర్, నవంబర్ 7 (ఆంధ్రప్రభ) యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని సదర్శాపూర్ గ్రామంలో పాముకాటుతో పాడిగేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు బల్లెకారి అంజయ్య వ్యవసాయం చేస్తూనే జీవనోపాధి కోసం ఓ గేదెను రూ.60 వేలకు కొనుగోలు చేశాడు. గురువారం రాత్రి ఆ గేదెను పాముకాటు వేయ‌డంతో మృత్యువాత ప‌డింది. దీంతో తాను జీవనోపాధి కోల్పోయానని, ప్రభుత్వం నష్టపరిహారం అందించి తనను ఆదుకోవాలని బాధిత రైతు విలపించాడు.

Leave a Reply