సీసీఐ ప‌త్తి కొనుగోలు ప్రారంభం..

సీసీఐ ప‌త్తి కొనుగోలు ప్రారంభం..

జైనూర్, ఆంధ్రప్రభ : రైతులు పండించిన పత్తిని సీసీఐ తీసుకువచ్చి విక్రయించాలని జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బానోత్ జైవంతరావు(Banoth Jaivantha Rao) సహకార చైర్మన్ కొడప హన్ను పటేల్ అన్నారు. ఈ రోజు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని ప్రైవేట్ సర్రాన్ జిన్నింగులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలును ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు శాలువాలతో సన్మానించి పత్తిని పరిశీలించారు.

మొదటిరోజు సీసీఐ ద్వారా పత్తి క్వింటాల్‌కు 8110(8110 per quintal) మద్దతు ధరతో ప్రారంభించారు. రైతులు అధిక మద్దతు ధర ఉన్న సిసిఐ విక్రయించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మండల ఇన్చార్జి వ్యవసాయ అధికారి ఆనంద్ రావు, ఏఈఓలు రాము, వినోద, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అబ్దుల్ ముఖిద్(Abdul Mukhid), మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పంద్ర శేకు, కృష్ణ రాధాబాయి, సర్రాన్ జిన్నింగ్ నిర్వాకులు అబ్దుల్లా సెట్, నాసర్, నాయకులు మెస్రం అంబాజీరావు, చిర్లే లక్ష్మణ్ యాదవ్, భుజంగరావు, మార్కెట్ కమిటీ ఉద్యోగులు మధు, చందర్ సింగ్ (బబ్లు) దత్త, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply