Shooting ball | జాతీయ స్థాయి పోటీల‌కు పాలమూరు బిడ్డ‌లు..

మక్తల్‌, (ఆంధ్రప్రభ) : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో సెప్టెంబర్‌ 22 నుంచి 24 వరకు జరిగిన 44వ జూనియర్‌ షూటింగ్ బాల్‌ బాలబాలికల రాష్ట్రస్థాయి క్రీడల్లో మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి రాణించారు. ఈ పోటీల్లో ప్రతిభ ప్రదర్శించిన కర్ణి గ్రామానికి చెందిన కే.శివకుమార్, మక్తల్‌కు చెందిన దీపిక, మహబూబ్‌నగర్‌కు చెందిన స్రవంతి జాతీయ స్థాయి షూటింగ్ బాల్‌ క్రీడలకు ఎంపికయ్యారు.

ఈ ముగ్గురు క్రీడాకారులు తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో నవంబర్‌ 7 నుండి 10 వరకు జరగనున్న జాతీయ స్థాయి షూటింగ్ బాల్‌ క్రీడల్లో పాల్గొననున్నారు.

తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్‌ ఉపాధ్యక్షుడు బి.గోపాలం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌. ఐలయ్య గురువారం వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే క్రీడాకారులకు స్పోర్ట్స్‌ కిట్‌, క్రీడా దుస్తులు అందజేశారు. వారిని అభినందిస్తూ జాతీయ స్థాయిలో మెరిసి తెలంగాణకు గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు.

జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులను రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం.శ్రీనివాసులు, సి.హెచ్‌. ఐలయ్య, ఉపాధ్యక్షుడు బి.గోపాలం శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయా పాఠశాలల పీడీలు రజిని, బీ.రూప, లావణ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సత్య ఆంజనేయులు, ఎస్‌.రమేష్ కూడా అభినందించారు.

ఈ జాతీయ స్థాయి క్రీడల్లో తెలంగాణ బాలికల జట్టు కోచ్‌గా జి.శిరీష, బాలుర జట్టు కోచ్‌గా బి.పవన్‌కుమార్ వ్యవహరిస్తారని బి.గోపాలం తెలిపారు.

Leave a Reply