నవీన్ యాదవ్‌కే ఓటు వేయాలి.. మంత్రి అడ్లూరి

నవీన్ యాదవ్‌కే ఓటు వేయాలి.. మంత్రి అడ్లూరి
జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ ఎల్.ఎన్.నగర్లో బుధవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) దళిత నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇది దొరల సర్కారు కాదు, ప్రజల సంక్షేమానికి అంకితమైన ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి వర్గం, ప్రతి కుటుంబం అభివృద్ధి ఫలాలు పొందుతున్నాయని తెలిపారు.

మూడు సార్లు బీజేపీని, రెండు సార్లు బీఆర్ఎస్ (BRS) ను గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలు, ఒక్కసారి ఆలోచించాలన్నారు. “పది ఏళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. స్లమ్ ప్రాంతాల పరిస్థితి ఎంత దారుణంగా మారిందో ప్రజలే సాక్ష్యమన్నారు.

ఇప్పుడా పార్టీ తిరిగి వస్తే ఏమి చేస్తుంది? అని మీరే ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ కలిసి కాంగ్రెస్‌ను అడ్డుకోవడానికి కుట్రలు పన్ని చూస్తున్నాయని, ఎన్నికలో వారికి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

