చెరువుగట్టులో పూజలు..

చెరువుగట్టులో పూజలు..

నార్కట్ పల్లి (ఆంధ్రప్రభ)
కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. బుధవారం చెరువుగట్టు దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు. మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు.

Leave a Reply