అక్కా చెల్లెళ్లకు కొవ్వొత్తుల నివాళి…
వెల్గటూర్, ప్రభన్యూస్ : చేవెళ్లలో సోమవారం జరిగిన బస్ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెల్లు మృతి చెందడంతో వారితో పాటు బస్లో ప్రయాణిస్తున్న మరో 25 మంది మృతి చెందగా ఈ రోజు రాత్రి జగిత్యాల జిల్లా(Jagtial District) వెల్గటూర్ మండలంలోని రాజక్కపల్లి గ్రామ(Rajakkapalli village) యువకులు సంతాపం తెలియజేశారు.
రాజక్క పల్లి గ్రామంలో వారికి కొవ్వొత్తులతో నివాళి అర్పించి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బోడకుంటి రమేష్, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ పత్తిపాక వెంకటేష్, వార్డు సభ్యులు, సైరా, సన్నీ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

