మీస్సింగ్ కేసు మిస్టరీ వీడింది…
కోనరావుపేట, ఆంధ్రప్రభ : తప్పిపోయిన వ్యక్తి చెరువులో శవమై దొరికాడు. మీస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. వివరాల్లోకి వెళ్తె రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన బద్దెపురి. నారాయణ(Baddepuri. Narayana)(80) అక్టోబర్ 31న రాత్రి సమయంలో ఇంట్లోనుండి వెళ్ళిపోయాడు.
కనబడటం లేదని అతని కొడుకు నవంబర్ 03న పోలీస్ స్టేషన్ లో పిర్యాదు ఇవ్వగా ఎస్.ఐ ప్రశాంత్ రెడ్డి మిస్సింగ్ కేసు(missing case) నమోదు చేసి దర్యాప్తు చేయగా ఈ రోజు కుటుంబసభ్యులకి మలకపేట రిజర్వాయర్లో నీటిలో ఒడ్డుకి శవంలా కొట్టుకొని వచ్చి కనిపించగ పోలీస్ లకు సమాచారం ఇచ్చారు. కోనరావుపేట(Konaraopet) ఎస్.ఐ ప్రశాంత్ రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని బయటకి తీయించారు.
అనంతరం శవపంచనామ నిర్వహించి, శవపరీక్షకు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుమారులు, కూతుర్లు తమ తండ్రికి మతిస్థిమితం లేక నీటిలో దిగడం వల్ల ప్రమాదవశాత్తూ నీట మునిగి ఈత రాక చనిపోయి ఉంటాడని, వారికి ఎవరి పైన అనుమానం లేదని పిర్యాదు చేశారని ఎస్. ఐ తెలిపారు.

