హైదరాబాద్ : శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం ఉదయం పెనుప్రమాదం తప్పింది. ఓ కార్గో విమానానికి ల్యాండింగ్ సమస్య తలెత్తడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. అయితే పైలట్ అప్రమత్తతో విమానం సేఫ్‌గా దిగగా.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ విమానాలకు అనుమతులు కాసేపు నిలిపివేశారు.
చెన్నై నుండి హైదరాబాద్‌కు వస్తున్న బ్లూడార్ట్ కార్గో విమానానికి ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తింది. పైలట్ అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్‌కు ఎయిర్‌పోర్టు అధికారుల అనుమతి కోరాడు. వెంటనే అధికారులు స్పందించి ఇతర అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ ను నిలిపివేశారు.
దీంతో.. ఎటువంటి అవాంతరాలు లేకుండా, పైలట్ విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ చేయగలిగారు. ఆ విమానంలో ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో కాసేపు భయాందోళన కలిగించింది. విమానం ల్యాండింగ్ గేర్ సమస్యను సాంకేతిక నిపుణులు పరిశీలిస్తున్నారు.