ఆకస్మిక తనిఖీలు..

అల్వాల్ పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఓయో రూమ్స్‌పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అల్వాల్ పోలీసులు సడన్ డ్రైవ్ చేపట్టి, ప్రతి గదిని పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులు ఆధార్ కార్డు వివరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, రూమ్స్ కేటాయింపు సమయంలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. మైనర్లకు, ఆధార్ కార్డు లేని వారికి గదులు ఇవ్వరాదని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో అల్వాల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుమార్, ఎస్ఐ దేవేందర్, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply