ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి బస్టాండ్ (Peddapalli bus stand) అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా మూలమలుపు వద్ద కరీంనగర్ నుండి గోదావరిఖని వెళ్లే ఆర్టీసీ బస్సు నడుచుకుంటూ వెళ్తున్న పెద్దపల్లి పట్టణం శాంతి నగర్ కు చెందిన పెంజర్ల లక్ష్మీ నారాయణను ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన లక్ష్మి నారాయణను ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంఘటనా స్థలాన్ని పెద్దపల్లి పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply