వారిద్దరి పిల్లల్ని హాస్టల్ లో చదివిస్తారా..?
హిందూపురం, అక్టోబర్ 28 ( ఆంధ్రప్రభ ) : రాష్ట్రంలో బీసీ హాస్టల్ ల (BCHostels) లో పరిస్థితి అధ్వానంగా తయారైందని.. హిందూపురంలో ఉన్న బీసీ హాస్టల్ లను ఇంచార్జ్ దీపిక రెడ్డి ఆదేశాల మేరకు తనిఖీ చేశారు. స్థానిక ముక్కడి పేటలో ఉన్న బీసీ హాస్టలను నియోజవర్గ బీసీ సెల్ అధ్యక్షులు రామాంజనేయులు ఆధ్వర్యంలో నియోజవర్గ బీసీ సెల్ నాయకులు, కార్యకర్తలు హాస్టల్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్టల్లలో నెలకొన్న సమస్యల పై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దీంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కనీసం అక్కడ కాంపౌండ్ వాల్ కూడా లేకుండా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు హాస్టల్ అడ్డాగా మారిపోయింది. రాత్రి వేళలో అక్కడ పేకాట అదే విధంగా జూదం ఇంకా మద్యం గంజాయి తదితర అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్లు గుర్తించారు. అక్కడే విద్యార్థులు (students) అదే విధంగా పక్కన నివాసం ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్లో కనీసం మెనూ కూడా పాటించడం లేదని దీంతో పాటు విద్యార్థులకు రావలసిన అరటిపండు, కోడిగుడ్డు అదేవిధంగా పౌష్టికాహారం కూడా అందడం లేదని విద్యార్థులు తమ బాధలను వ్యక్తం చేశారు. అయితే.. ఈ విషయాలు ఎవరికైనా చెబితే మమ్మల్ని హాస్టల్ నుండి పంపించి వేస్తారన్న భయంతో ఎవరికి చెప్పకుండా ఉన్నట్లు విద్యార్థులు తెలియచేశారు. పక్క నియోజకవర్గంలోనే ఉన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఒకసారి ఈ హాస్టల్లో పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుందని తెలిపారు. విద్యార్థులకు కనీస వసతులు లేవని వర్షం వస్తే.. పరిస్థితి ఎలా ఉంటందనే విషయాన్ని సబితమ్మ గుర్తించాలని తెలిపారు.
హాస్టల్ వార్డెన్ (Hostel Warden) సరిగా అందుబాటులో లేకుండా రెండు రోజులకు మూడు రోజులకు వస్తుందని అక్కడ వాతావరణం సరిగా లేక చుట్టూ ముళ్లకంపులు అదేవిధంగా అశుభ్రంగా ఉండడంతో అక్కడ విష సర్పాలు, పందులకు కూడా నిలయంగా మారిపోయిందని విద్యార్థులు తెలియచేశారు. మంత్రి సవితమ్మ ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి జపం చేస్తుందని బీసీ విద్యార్థుల దయనీయ పరిస్థితి ఒకసారి చూడాలని విద్యార్థులు పడుతున్న బాధలను గుర్తించాలని రామాంజనేయులు ధ్వజమెత్తారు.ఆమె స్పందించకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు ఉధృతం చేస్తామని కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
విద్యార్థులకు వెంటనే మెనూ ప్రకారం బోధన కల్పించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇన్చార్జ్ దీపికా వేణురెడ్డితో పాటు త్వరలో పెద్ద ఎత్తున హాస్టల్ల మీద ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సిరి వరం వైసీపీ యూత్ లీడర్ రవికుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు అదే విధంగా పవన్ కళ్యాణ్ లా పిల్లలను ఇటువంటి హాస్టల్లో చదివిస్తారా ? అని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రోషన్ అలీ, బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ నాగేంద్ర , తగ్గళ్ళు నరసింహా, తిరువరం రవిరాజు, జుమ్మాకులపల్లి మూర్తి, లేపాక్షి చలపతి, లేపాక్షి సీనా, మలగూరు మోహన్, సిరి వరం భాస్కర్, ఏడో వార్డ్ ఇంచార్జ్ అయూబ్ బేగ్, బాబా జాన్, సీనియర్ నాయకులు కొల్లప్ప నాయకులు సూర్య మోహన్ తదితరులు పాల్గొన్నారు.

