పేద విద్యార్థులతో సీఎం చెల‌గాటం..

పేద విద్యార్థులతో సీఎం చెల‌గాటం..

నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : విద్యార్థుల సమస్యల ప‌రిష్క‌రించాల‌ని ఈ నెల 30న విద్యాసంస్థల బంద్ చేయ‌నున్న‌ట్లు ఎస్ ఎఫ్ ఐ(SFI) జిల్లా నాయ‌కులు తెలిపారు. ఈ బంద్‌ను విజ‌య‌వంతం చేయాలని కోరారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు నరహరి(Narahari) మాట్లాడారు.

“టెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఇచ్చిన హామీలు దొంగ హామీలేనని, రెండు సంవత్సరాలుగా 8,150 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement) పెండింగ్‌లో ఉన్నాయని” తీవ్రంగా విమర్శించారు. “ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక, సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నరన్నారు.

గత నెలలో ప్రభుత్వం కళాశాల యాజమాన్యాలతో చర్చలు జరిపి రూ.1200 కోట్లను రెండు దఫాలుగా విడుదల చేస్తామని చెప్పినా, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఇది పేద విద్యార్థులపై తీవ్రమైన మోసం” అని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు భాను ప్రసాద్(Bhanu Prasad), మండల కమిటీ నాయకులు మహేష్ యాదవ్, చింటూ, శివ, మాధవులు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply