కొత్త కమిటీ ఎన్నికలు..
ఎండపల్లి, ఆంధ్రప్రభ : ఎండపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (STUTS) ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గాలేటి శ్రీనివాస్ రెడ్డి (ZPHS గుల్లకోట) మండల అధ్యక్షుడిగా, నాగం రమేష్ (MPPS ఎండపల్లి) మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అలాగే శనిగరపు రవి (ZPHS గుల్లకోట), అంతడుపుల శ్రీనివాస్ (MPPS రాజారాంపల్లి) జిల్లా కమిటీ సభ్యులుగా (DC) ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మచ్చ శంకర్, ప్రధాన కార్యదర్శి బైరం హరికిరణ్ మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన నాయకులకు STUTS జగిత్యాల జిల్లా శాఖ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండి పోరాటం చేస్తుందని వారు తెలిపారు.

