జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించండి

జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించండి

చారిత్రాత్మక ఓరుగల్లు సమగ్రాభివృద్ధికై అదనపు నిధులు సాధించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తానని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసే చర్యలు తీసుకోవాలన్నారు. ఓరుగల్లు అభ్యున్నత్తి పై ప్రత్యేక ఫోకస్ పెడతానని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం, ప్రత్యేక ప్రాజెక్టల పురోగతి పై వరంగల్ కలెక్టరేట్ లో శుక్రవారం జిల్లా కలెక్టర్ సత్య శారదతో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి మంజూరైన పలు స్కీములు, ప్రజాప్రయోజన పనుల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ… వరంగల్ జిల్లా అభివృద్ధి వేగం మరింత పెంచడానికి కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్ళను వెంటనే క్లియర్ చేసి ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలన్నారు. జిల్లాలో రహదారులు, నీటి పారుదల, విద్య, ఆరోగ్య విభాగాల్లో ప్రాధాన్యత ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నుండి అదనపు నిధులు కేటాయించేలా ప్రయత్నాలు చేస్తానని ఎంపీ డా. కడియం కావ్య తెలిపారు. వరంగల్ అభివృద్ధి విషయంలో వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో తన గళాన్ని వినిపిస్తానని ఎంపీ కావ్య స్పష్టం చేశారు.

జిల్లా ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధి దిశగా కృషి చేస్తానన్నారు. వరంగల్‌ను జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తెలిపారు. మున్సిపల్ స్మార్ట్ సిటీ పథకంను సద్వినియోగం చేసుకోవడం పై ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేస్తే నిధుల సాధనకు కృషి చేస్తానన్నారు. ఓరుగల్లు అభివృద్ధిని పరుగులు పెట్టించే ప్రయత్నాలు చేద్దామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఏ ఏ పథకాల ద్వారా నిధులు సాధించే అవకాశాలు ఉన్న ప్రతిపాదనలు సిద్ధం చేస్తే, తన వంతు ప్రభుత్వం పై ఒత్తిడిని పెంచి సాధించుకు వస్తానని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు.

Leave a Reply