రికార్డు స్థాయిలో రీడింగ్!
గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : డ్రంక్ అండ్ డ్రైవ్‌పై గోదావరిఖని ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో తరచూ నిఘా వేస్తున్నారు. ఈ క్రమంలో సీఐ రాజేశ్వరరావుకు చంద్రాపూర్ నుంచి పాల్వంచకు బొగ్గు రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ మత్తులో లారీ నడుపుతున్నాడని సీఐకి సమాచారం అందింది. సీఐ తన బృందంతో కలిసి లారీని ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా డ్రైవర్ కు 309 రీడింగ్ నమోదైంది. ఇది చట్టపరమైన పరిమితి కంటే అత్యధికం కావడంతో డ్రైవర్ పూర్తి మత్తులో ఉన్నట్లు సీఐ నిర్థారించారు. అనంతరం డ్రైవర్ పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. డ్రైవర్ను రేపు కోర్టుకు హాజరు పరుస్తామని తెలిపారు.

