కాంగ్రెస్ ఓబీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ రవీందర్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయాన్ని ఎవరు ఆపలేరని కాంగ్రెస్ పార్టీ ఓబిసి రాష్ట్ర వైస్ చైర్మన్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమాత్ నగర్ డివిజన్ ఇన్చార్జి తిరుపతి రవీందర్ తెలిపారు.
ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేయడానికి గాను కాంగ్రెస్ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ చౌటుప్పల్ మండలానికి చెందిన తిరుపతి రవీందర్‌ను రహమత్ నగర్ డివిజన్ ఇన్చార్జిగా నియమించారు. రహమాత్ నగర్ డివిజన్ ఇంచార్జిగా పార్టీ శ్రేణులతో కలిసి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తూ డివిజన్‌లో అత్యధిక మేజారిటి వచ్చే విధంగా కృషి చేస్తామని రవీందర్ తెలిపారు.