గన్నేరువరం స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం.
గన్నేరువరం, అక్టోబర్ 23: పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నేరువరం ఎస్సై జి. నరేందర్ రెడ్డి విద్యార్థులకు స్టేషన్లోని విభాగాల కార్యకలాపాల పై అవగాహన కల్పించారు. పోలీసులు నిర్వహించే విధులు, ప్రజల భద్రతకు పాటించే చర్యలు, నిత్య కార్యకలాపాలపై వివరించారు. విజ్ఞాన్ హైస్కూల్ విద్యార్థులు ఆసక్తిగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బూర వెంకటేశ్వర్, ప్రిన్సిపాల్ భాను చైతన్య, స్టేషన్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.