240 ఇళ్ళలోని 420 మందికి ర్యాపిడ్ టెస్ట్ కిట్

240 ఇళ్ళలోని 420 మందికి ర్యాపిడ్ టెస్ట్ కిట్

లక్షెట్టిపేట, ఆంధ్ర ప్రభ : మండలంలోని వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈనెల 13 నుంచి నిర్వహిస్తున్న ఫైలేరియా వ్యాధి నిర్ధారణ టాస్ వన్ సర్వే ఈ రోజుతో ముగిసిందని డాక్టర్ సతీష్ కుమార్(Dr. Satish Kumar) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రజలందరికి 2021 నుండి 2023 వరకు వరుసగా మూడు సంవత్సరాల పాటు బోధకాల నివారణ మాత్రలను అందజేశామని, నాలుగో విడుతలో బోధకాల వ్యాధి ఎలిమినేషన్(Elimination)లో భాగంగా వ్యాధి వ్యాప్తి ఏవిధంగా వుందో తెలుసుకోవడానికి టాస్ వన్ సర్వే నిర్వహించామన్నారు.

మండలంలోని వెంకట్రావుపేట, చందారం, మోదెల, ఇటిక్యాల నాలుగు గ్రామాలలో ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో ర్యాండమ్ గా 60 ఇళ్ళలోని 105 మందికి మొత్తం 240 ఇళ్ళలోని 420 మందికి ర్యాపిడ్ టెస్ట్ కిట్(Rapid Test Kit) ద్వారా ఫైలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి నివేదికలు ఉన్నతాధికారులకు పంపుతున్నామని సర్వే వివరాలను ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్లు శోభ, మార్త, ల్యాబ్(Shobha, Martha, Lab టెక్నీషియన్ అజీజ్ ఖాన్, ఎంఎల్ హెచ్ పీలు సుమలత, రజిత, స్రవంతి, హెల్త్ అసిస్టెంట్లు గఫూర్, ఇసాక్ అహ్మద్ వేణు, ఏఎన్ఎంలు తిరుమల, మంకుబాయి, యేసువర, విజయదర్షిణి, చిలుకమ్మ, నర్సమ్మ, సారాజ్యోతి, ఆయా గ్రామాల ఆశావర్కర్స్ పాల్గొన్నారు.

Leave a Reply