ప్రభాస్ క్రేజీ అప్ డేట్స్

ప్రభాస్ క్రేజీ అప్ డేట్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23న. ఈరోజున రెబ‌ల్ ఫ్యాన్స్ కు పండుగే… అయితే, ప్రభాస్ ఏ హీరో చేయని విధంగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. రెండు సినిమాలు సెట్స్ పై ఉంటే మూడు, నాలుగు సినిమాలు సెట్స్ పైకి వచ్చేందుకు రెడీగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ప్ర‌భాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ కొత్త సినిమాల అప్ డేట్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు మేక‌ర్స్. దీంతో ఈ ఇయర్ ప్రభాస్ నుంచి ఏ ఏ సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ రానున్నాయి అనేది ఆసక్తిగా మారింది.

ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. దీనికి మారుతి డైరెక్టర్. హర్రర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న సినిమా ఇది. ఫస్ట్ టైమ్ ప్రభాస్ హర్రర్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తుండడంతో రాజాసాబ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ మూవీని నిర్మిస్తుంది. డిసెంబర్ 5న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. సంక్రాంతికి జనవరి 9న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఈ మూవీ నుంచి ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆరోజు 12 గంటలకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు.

ఇక ప్రభాస్ నటిస్తున్న మరో భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ మూవీ నుంచి టైటిల్ ను 11 గంటల 07 నిమిషాలకు అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.

అలాగే ప్రభాస్ ఎప్పుడో అనౌన్స్ చేసిన భారీ పాన్ ఇండియా మూవీ స్పిరిట్. ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించనున్నారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ గా ప్రభాస్ నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి కానీ.. ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో బిజీగా ఉండడం వలన ఆలస్యం అయ్యింది.

దీనికి సంబంధించిన అప్ డేట్ 2 గంటలకు అప్డేట్ రానుందని సమాచారం. అదేవిధంగా, నాగ అశ్విన్ ప్రాజెక్ట్ కల్కి నుంచి ఇప్పటి వరకు చూడని గ్లింప్స్ ను సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇక సలార్ 2 కు సంబంధించి అప్ డేట్ రాత్రి 7 గంటలకు ఇవ్వనున్నారు. ఫైనల్ గా రాత్రి 9 గంటలకు రాజాసాబ్ నుంచి సర్ ఫ్రైజ్ రానుందని తెలిసింది.

ఇలా రోజు మొత్తం ప్రభాస్ కొత్త సినిమాల అప్ డేట్స్ ఇవ్వడానికి సెట్ చేశారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ అప్ డేట్స్ వస్తాయా అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో.. ప్రభాస్ బర్త్ డే డార్లింగ్ ఫ్యాన్స్ కు నిజంగా పండగే.

Leave a Reply