రహదారులు దిగ్భంధం

  • ఉధృతంగా ప్రవహిస్తున్న కోవనూరు కాలువ
  • నిండుకుండ‌లా కాళంగి జలాశయం
  • కె వి బి పురం సంత వద్ద భారీగా నిలిచిన వర్షపు నీరు
  • పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

కె వి బి పురం, అక్టోబర్ 22 (ఆంధ్రప్రభ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల (Rains) కు కాలువలు, చెరువులు, నదులు, జ‌లాశ‌యాలు నిండుకుండలా మారాయి. ఎటు చూసినా నీటితో నిండిపోయి సముద్రాన్ని తలపిస్తోంది. వ్యవసాయ, పాడి రైతులు ఈ వర్షాలకు భారీ నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలం నుంచి పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పిచ్చాటూరు నుంచి శ్రీ కాళహస్తి (Srikalahasti) వైపు వెళ్లె ప్రధాన రహదారిపై తిమ్మ సముద్రం, కోవనూరు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

మండలంలోని సంత వద్ద రహదారిపై భారీగా వర్షపు (Heavy Rains) నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎస్ ఎల్ పురం నుంచి ఆదవరం వెళ్లు రహదారిపై సంవత్సరం ముందు వర్షానికి కొట్టుకొనిపోయిన కాజ్వేలు మరమ్మతులకు గురి కాకపోవడంతో ఈ వర్షాలకు రోడ్డు భారీ కోతకు గురైంది. కాళంగి నదికి భారీగా వర్షపు నీరు చేరి నిండుకుండను తలపిస్తుంది. కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ అల్పపీడనం రేపు వాయుగుండంగా మారుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Leave a Reply