అఖండ 2.. అంతకు మించి..
బాలయ్య స్పీడు మామూలుగా లేదు.. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్.. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధిస్తూ దూసుకెళుతున్నారు. ఇప్పుడు అఖండ సినిమాకి సీక్వెల్ అఖండ 2 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రేజీ మూవీని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో రూపొందిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు ఒక దానిని మించి మరోటి సక్సెస్ సాధించాయి. దీంతో వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుందంటే.. ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ సాధించడం ఖాయమనే అభిప్రాయం అటు ఆడియన్స్ లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ బలంగా ఉంది.
ఇక అసలు విషయానికి వస్తే.. ఇప్పుడు అంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలే కాదు.. మీడియం రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా మూవీ చేయాలని తపిస్తున్నారు. అయితే.. బాలయ్య ఇంత వరకు పాన్ ఇండియా మూవీ చేయలేదు. ఇప్పుడు అఖండ 2 మూవీని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడు కమర్షియల్ సినిమాలో భక్తిరసాన్ని కలిపితే ఆ చిత్రాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. అందులోనూ నార్త్ జనాలు ఈ తరహా చిత్రాలకు బ్రహ్మారథం పడుతుండడంతో అఖండ 2 సినిమా సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్నారు.
ఈ క్రేజీ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. డిసెంబర్ 5న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. అయితే.. బాలయ్య ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా ప్రయత్నం చేస్తుండడంతో అఖండ 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో మెప్పిస్తుంది..? బాలయ్య చేస్తున్న ఈ సరికొత్త ప్రయత్నం ఫలిస్తుందా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది.