అధికారులు అప్ర‌మ‌త్తం

ఏర్పేడు అక్టోబర్ 22 (ఆంధ్రప్రభ): మండలంలోని మోదుగుల పాల్యం (Modugulapalem) వద్ద సువర్ణముఖి నదిలో నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. రెవెన్యూ, పంచాయ‌తీ అధికారుల‌తో పాటు పోలీసులు న‌దిలోకి ఎవ‌రూ వెళ్ల‌కుండా బందోబస్తు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

సువర్ణముఖి నది (Suvarnamukhi River) లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఉధృతంగా నీరు నదిలోకి చేరుతోంది. దీంతో నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. నదిలోకి ఎలాంటి వాహనాలు, ప్రజలు గాని దిగకుండా ఆయా ప్రవాహల వద్ద అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏర్పేడు మండలంలో పాపా నాయుడుపేట -గుడిమల్లం మధ్య, గోవింద వరం- మునగల పాల్యం మధ్య, కొత్తవీరాపురం- మోదుగులపాలెం గ్రామాల మధ్య సువర్ణముఖి నదిలో లెవెల్ కాజ్వే లకుమించి ప్రవహిస్తూ ఉంది. దీంతో రాకపోకలు స్తంభించాయి. సీఐ శ్రీకాంత్ రెడ్డి, త‌హ‌సీల్దార్ భార్గ‌వి, ఎంపీడీఓ సౌభాగ్యం న‌దీ ప్ర‌వాహాన్ని ప‌ర్య‌వేక్షిస్తూ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

Leave a Reply