నివాళులర్పిస్తున్న కమాండెంట్ కే వీరయ్య
నల్గొండ అక్టోబర్ 21(ఆంధ్ర ప్రభ): శాంతి భద్రత పరిరక్షణ ప్రజారక్షణ దేహంగా పోలీసులు విధి నిర్వహణలో పనిచేస్తూ మరణించిన వారి త్యాగాలు ఎప్పటికీ అన్నే పర్తి 12 బెటాలియన్ కమాండెంట్ కె వీరయ్య అన్నారు. అక్టోబర్ 21 అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మంగళవారం బెటాలియన్ లో నిర్వహించిన అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల స్తూపాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశంలో విధి నిర్వహణలో ఇప్పటికీ 192 మంది మరణించడం జరిగిందని గుర్తు చేశారు.
శాంతి భద్రతల పరిరక్షణకు,ప్రజా రక్షణకు విది నిర్వహణలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించారని పేర్కొన్నారు. వారిలో మన తెలంగాణ రాష్ట్రంలో ఐదుగురు ఉన్నారని తెలిపారు.ఎందరో పోలీస్ సిబ్బంది ప్రాణాలను లెక్కచేయకుండా విధి నిర్వాహణలో వారి ప్రాణాలను త్యాగం చేయడం జరిగిందని అన్నారు.వారి త్యాగం వలనే నేడు శాంతియుత వాతవరణం నెలకొన్నదని, ప్రజలు కూడా శాంతి యుతంగా ఉంటున్నారని, వారి త్యాగాలు మరవలేనివి అన్నారు.
ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ 21 ను పురస్కరించుకోని వివిధ కార్యక్రమాలు ఈ నెల 31వ తేది వరకు వివిధ కార్యక్రమాలు పోలీస్ ఓపెన్ హౌస్,మెగా రక్తదాన శిబిరాలు,షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ పోటీలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు,సైకిల్ ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండేంట్స్ సిహెచ్ అంజనేయరెడ్డి, నర్సింగ్ వెంకన్న యూనిట్ హాస్పిటల్ డాక్టర్ షర్మిలా దేవి,ఆర్ఐలు, ఆర్ ఎస్ ఐలు,బెటాలియన్ సిబ్బంది, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.