చిరు టైటిల్ వెనకున్న సీక్రెట్

చిరు టైటిల్ వెనకున్న సీక్రెట్


శంకర్ వరప్రసాద్ అనగానే ఠక్కున సినీ అభిమానులకు.. ఇంకా చెప్పాలంటే తెలుగు జనాలకు మెగాస్టార్ చిరంజీవే గుర్తొస్తారు. ఎందుకంటే… ఇది ఆయన అసలు పేరు. అయితే.. ఇప్పుడు అనిల్ రావిపూడి మన శంకర్ వరప్రసాద్ గారు అంటూ ఏకంగా సినిమాకి టైటిల్ గా పెట్టడం తెలిసిందే. ఈ టైటిల్ పెట్టగానే వెంటనే జనాల్లోకి వెళ్లిపోయింది. అంతా బాగానే ఉంది కానీ.. ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి..? ఇంత వరకు చిరు తన సినిమాలకు ఈ టైటిల్ ఎందుకు పెట్టలేదు..? ఇందులో చిరు నిజ జీవిత కథను ఏదైనా చూపించబోతున్నాడా..?

అనిల్ రావిపూడి.. తన సినిమాలను ఎలా ప్రమోట్ చేయాలో.. ఎలా జనాల్లోకి తీసుకెళ్లాలో బాగా తెలుసు. అందుకనే.. ఈ టైటిల్ పెడితే క్యాచీగా ఉంటుందని.. జనాల్లోకి వెంటనే వెళుతుందనే ఉద్దేశ్యంతోనే ఈ టైటిల్ పెట్టారనిపిస్తుంది. అనిల్ అనుకున్నట్టుగానే ఈ టైటిల్ పెట్టగానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. నలభై ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో చిరంజీవి ఇప్పటి వరకు 156 సినిమాల్లో నటించారు. అయితే.. ఎవరికీ ఆలోచన రాలేదో ఏమో కానీ.. ఆయన అసలు పేరును టైటిల్ గా ఏ సినిమాకి పెట్టలేదు. దీనిని గుర్తించిన అనిల్ అదే టైటిల్ గా పెట్టారు.

ఈ టైటిల్ రిలీజ్ చేసినప్పటి నుంచి చిరు నిజ జీవిత కథను ఇందులో చూపించబోతున్నారా..? అనే డౌట్ వచ్చింది సినీ జనాలకు. చిరంజీవి ఒక వ్యక్తిగా సినీ ప్రయాణం ఆరంభించి ఆతర్వాత ఒక శక్తిగా మారారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అందుకనే మరింత మందికి స్పూర్తిని ఇచ్చేలా ఆయన కథను చూపించబోతున్నారేమో అనే ప్రచారం జరుగుతుంది. మొత్తానికి అనిల్ ఏదో పెద్ద ప్లాన్ తోనే ఈ టైటిల్ పెట్టాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. మరో వైపు శంకర్ దాదా జిందాబాద్ అనే టైటిల్ తో సినిమా రావడం.. అది బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. అందుచేత సెంటిమెంట్ గా కూడా వర్కవుట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఈ టైటిల్ పెట్టారని టాక్. మరి.. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో అనిల్ ఏం చూపించబోతున్నాడో..? అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే.. సంక్రాంతికి ఈ క్రేజీ మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Leave a Reply