అమలరుల స్మరణం మన బాధ్యత
- నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
- పోలీసు అమరులకు ఘన నివాళి
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : పోలీసు ఉద్యోగం కష్టతరమైందని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా(Princess Gania) అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం జిల్లా ఎస్పీ సునిల్ షెరాన్(Sunil Sheron) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజు లు హాజరయ్యారు.
ముందుగా పెరేడ్ కమాండర్ జి.బాబు వద్ద నుంచి జిల్లా కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం ఏ ఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు(AR DSP Srinivasa Rao) విధి నిర్వహణలో మరణించిన వారి వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ అమరులైన మన పోలీసు వీరులను స్మరించుకోవడం ఎంతైనా గర్వించదగ్గ విషయమన్నారు. పోలీసు ఉద్యోగం అనేది అత్యంత కష్టతరమైనదని అన్నారు. పోలీసు ఉద్యోగానికి పగలు,రాత్రి ఎండ వాన చలి అనే తేడాలు ఉండవన్నారు. వారు విధులు తప్పనిసరిగా నిర్వహించవలసి ఉంటుంది అందుకే ఇది చాలా కష్టంతో కూడుకున్నదన్నారు.
పోలీసులు(Police) సమాజంలో శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పిస్తూ అదే విధంగా శారీరకంగా మానసికంగా వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించవలసి ఉంటుందన్నారు. కుటుంబ బాధ్యతలను తీసుకొని పిల్లల విద్యలో వారికి మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు కృషి చేయవలసి ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ పోలీసులు ప్రతిరోజు ఎండ వాన చలి పగలు రాత్రి అనే తేడా లేకుండా విధులు నిర్వహించడం అత్యంత కష్టతరమైనదన్నారు.
సమాజంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే సంఘవిగ్రహ శక్తులను అరికట్టేందుకు, శాంతిభద్రతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు పోలీసులు చేసే సేవ చాలా అనిర్వచనీయమైనదన్నారు. పోలీసు అమరవీరులను ఆదర్శంగా,స్పూర్తిగా తీసుకుంటూ అమరవీరుల కుటుంబాలకు అండదండగా ఉంటామన్నారు. మూడవ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి అమ్మన్నరాజు(Additional District Judge Ammannaraju) మాట్లాడుతూ దేశాన్ని కాపాడేందుకు సైనికులు ఎలా నిరంతరం తన ప్రాణాలను సహితం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పలువురు డీఎస్పీలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.