ఉద్యోగం సాధించిన శాఖకు వన్నె తీసుకురావాలి

ఉద్యోగం సాధించిన శాఖకు వన్నె తీసుకురావాలి

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలనే లక్ష్యంతో అర్హత సాధించిన వారికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నియామక పత్రాలు అందజేశారని అంకిత భావంతో విధులు నిర్వహించి ఆ శాఖకు వన్నె తీసుకురావాలని రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడల యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Dr. Vakiti Srihari) అన్నారు.

ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొల్లూరు గ్రామానికి చెందిన కుర్వ రమేష్ ప్రభుత్వ సర్వేయర్ ఉద్యోగం సాధించడంతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అర్హత సాధించిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలు(welfare schemes) అర్హులైన పేద ప్రజలకు పారదర్శకంగా అమలు చేయాలన్నారు.

విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ రాబోయే కాలంలో ప్రభుత్వం మంజూరు చేసే వివిధ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. నీతి నిబద్ధతతో ఉద్యోగం చేస్తే ప్రభుత్వం, ప్రజలు ఆదరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు డి. యజ్ఞేశ్వర్ రెడ్డి(D. Yajneshwar Reddy), కొల్లూరు అధ్యక్షుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply