ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఘన నివాళులు

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పోలీస్ అమరవీరుల త్యాగాల వల్లే ప్రస్తుతం సమాజంలో శాంతి నెలకొంది. ఈ రోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ సందర్భంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని పెద్దపల్లి జిల్లా రామగుండం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల కేంద్రాల్లో పోలీసు అమర వీరులకు నివాళులు అర్పించారు. అమరవీరుల స్థూపాల వద్ద ఘన నివాళులర్పించి పోలీస్ అమరవీరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. రామగుండం కమిషనరేట్ ఆవరణలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సీపీ గౌస్ ఆలం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ హరిత, ఎస్పీ మహేష్ బీ. గితే అమరవీరులకు నివాళులర్పించారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
