జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కొప్పుల ఈశ్వర్
వెల్గటూర్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ (BRS) పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ కు మద్దతుగా… మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం చేశారు.
సోమవారం, ఆయన షేక్‌పేట్ డివిజన్‌లోని కొన్ని బూత్ నంబర్ల పరిధిలో వెల్గటూర్ మండల నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు, అలాగే పాదయాత్ర కూడా చేశారు.
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ పార్టీ పాలనలోని లోపాలను, అసమర్థతను ప్రజలకు వివరించారు. దాంతో పాటు గత పది సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను, చేసిన పనులను గుర్తు చేశారు.
ఓటర్లందరూ కారు గుర్తుకు ఓటు వేసి, మాగంటి సునీతా గోపీనాథ్‌ను ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో వెల్గటూర్ మండల నాయకులైన జూపాక కుమార్, మూగల సత్యం, ఎం.డి. రియాజ్, గాధం భాస్కర్‌లు కొప్పుల ఈశ్వర్‌తో పాటు పాల్గొన్నారు.